పట్టపగలే రెచ్చిపోతున్న దొంగలు.. తాళం వేసి ఉన్న ఇళ్లే టార్గెట్

నల్గొండలోని దోమలపల్లిలో పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు. గత కొన్ని రోజులుగా తాళం వేసి ఉన్న ఇండ్లు టార్గెట్ గా చేసుకొని దోపిడీకి పాల్పడుతున్నారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలోని కాసాని పాపయ్య ఇంట్లో తాళాలు పగలగొట్టి.. బీరువాలో ఉన్న రెండు లక్షల రూపాయలు, బంగారంతో పాటు వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారు. 

దీంతో కాసాని పాపయ్య కుటుంబం నల్గొండ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.