
కాంగ్రెస్ కీలక నేత ప్రియాంక గాంధీ వాద్రా భర్త రాబర్ట్ వాద్రాకు సమన్లు జారీ చేసింది ఈడీ.. హర్యానాలోని ఓ ల్యాండ్ డీలింగ్ కి సంబందించిన కేసులో సమన్లు జారీ చేసినట్లు సమాచారం. ఇదే కేసుకు సంబంధించి ఏప్రిల్ 8న మొదటిసారి సమన్లు జారీ చేసింది ఈడీ. అయితే.. ఈడీ సమన్లను పట్టించుకోలేదు వాద్రా. తాజాగా మంగళవారం ( ఏప్రిల్ 15 ) మరోసారి నోటీసులు జారీ చేసింది ఈడీ. విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొంది ఈడీ.
ఈ క్రమంలో ఈడీ విచారణకు హాజరైన వాద్రా కీలక వ్యాఖ్యలు చేశారు.. ఇది బీజేపీ ప్రతీకార చర్య అని అన్నారు వాద్రా. ప్రజల పక్షాన నిలబడి గొంతెత్తిన ప్రతిసారి బీజేపీ తనను అణివేచేసేందుకు ప్రయత్నిస్తోందని అన్నారు వాద్రా. ఈడీ విచారణకు సహకరిస్తానని.. అధికారులు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇస్తానని అన్నారు వాద్రా.
#WATCH | Delhi: Businessman Robert Vadra says, "... There is nothing in the case. For the last twenty years, I have been summoned 15 times and interrogated for more than 10 hours every time. I have submitted 23000 documents..." pic.twitter.com/zbecF3gJQA
— ANI (@ANI) April 15, 2025
ఫిబ్రవరి 2008లో వాద్రా కంపెనీ ఓంకారేశ్వర ప్రాపర్టీస్ నుండి గుర్గావ్ లోని షికోపూర్ లో 3.5 ఎకరాల స్థలాన్ని రూ. 7.5 కోట్లకు కొన్నట్లు గుర్తించింది ఈడీ. అనంతరం అదే భూమిని రియల్ ఎస్టేట్ దిగ్గజం డీఎల్ఎఫ్ కి రూ. 58కోట్లకు విక్రయించారని.. ఈ డీల్ లో వచ్చిన లాభాన్ని మనీ లాండరింగ్ ద్వారా తరలించినట్లు అనుమానిస్తోంది ఈడీ.