హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ నేత ప్రియాంక గాంధీ భరత్ రాబర్ట్ వాద్రా కీలక వ్యాఖ్యలు చేశారు. అతని భార్య( ప్రియాంకగాంధీ వాద్రా), తన కూతురుతో సహా దేశ మహిళలందరూ మేం..భద్రంగా ఉన్నా అని ఫీలయ్యే రోజులు రావాలని కోరుకుంటున్నానని రాబర్డ్ వాద్రా అన్నారు. శుక్రవారం (ఆగస్టు 30) హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లిని దర్శించుకున్న రాబర్ట్ వాద్రా.. ఈ వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో తాను పవర్ ఆఫ్ సెంటర్ కావడం భవిష్యత్తు నిర్ణయిస్తుందని అన్నారు వాద్రా..వయనాడ్ నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది.. ఆమెకు ఆల్ దిబెస్ట్ చెప్పారు రాబర్ట్ వాద్రా.
ALSO READ | ‘ప్రజలపై అణచివేతే’.. యూపీ సోషల్ మీడియా పాలసీపై ప్రియాంక గాంధీ ఫైర్
దేశంలో మహిళల భద్రత ప్రధాన సమస్యగా ఉంది.. తన భార్యాబిడ్డలతో సహా దేశంలోని మహిళలందరూ భద్రతగా ఉన్నాం అని ఫీలయ్యే రోజులు రావాలి.. మహిళలు భద్రంగా ఉండాలంటే వారితో ఎలా ప్రవర్తించాలో ఇంట్లో నేర్పించాలన్నారు.
దేశంలోని సమస్యలను తాను, రాహుల్ గాంధీ ఒకే కోణంలో చూస్తామని రాబర్ట్ వాద్రా అన్నారు. దేశ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు.. అది మరో ఐదేళ్ల తర్వాత మార్పు ను చూస్తారు అన్న రాబర్ట్ వాద్రా.. తాను కేవలం ఆధ్యాత్మిక భావనతోనే హైదరాబాద్ కు వచ్చినట్లు తెలిపారు.