ఆస్ట్రేలియాలో రాబిన్‌‌‌‌‌‌‌‌హుడ్

ఆస్ట్రేలియాలో  రాబిన్‌‌‌‌‌‌‌‌హుడ్

నితిన్,  శ్రీలీల  జంటగా  వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘రాబిన్‌‌‌‌‌‌‌‌హుడ్’.  ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే  మున్నార్, హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో  షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న టీమ్.. కొత్త షెడ్యూల్‌‌‌‌‌‌‌‌ను ఆస్ట్రేలియాలో ప్రారంభించారు. మెల్‌‌‌‌‌‌‌‌బోర్న్‌‌‌‌‌‌‌‌లో నితిన్,  శ్రీలీలతో డ్యూయెట్ సాంగ్‌‌‌‌‌‌‌‌ను చిత్రీకరిస్తున్నారు. కృష్ణకాంత్ లిరిక్స్‌‌‌‌‌‌‌‌తో జీవీ ప్రకాష్ ఆకట్టుకునే పాటను కంపోజ్ చేశారని, శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో  నితిన్, శ్రీలీల  డాజ్లింగ్ కెమిస్ట్రీ హైలైట్‌‌‌‌‌‌‌‌గా ఉండబోతోందని మేకర్స్ చెప్పారు.

ఈ సాంగ్‌‌‌‌‌‌‌‌తో  పాటు రాజేంద్ర ప్రసాద్,  బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్‌‌‌‌‌‌‌‌తో సహా  ఇతర నటీనటులపై  టాకీ పార్ట్‌‌‌‌‌‌‌‌ని చిత్రీకరించనున్నారు. ఈ చిత్రంలో  ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ అతిథి పాత్రలో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది.  మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్నారు.  క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న సినిమా విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.