Robin Uthappa: యువరాజ్ సింగ్ రిటైర్ అవ్వడానికి కోహ్లీనే కారణం.. రాబిన్ ఉతప్ప సంచలన ఆరోపణలు

టీమిండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్ లో భారత జట్టు విజయాల్లో తన వంతు పాత్ర పోషించాడు.మిడిల్ ఆర్డర్ లో టీమిండియాకు వెన్నుముకగా నిలిచాడు. ముఖ్యంగా భారత జట్టు వన్డే వరల్డ్ కప్ తో పాటు.. టీ20 వరల్డ్ కప్ గెలవడంతో యువీదే కీ రోల్. 2011 వన్డే వరల్డ్ కప్ సమయంలో క్యాన్సర్ నుంచి కోలుకొని కంబ్యాక్ ఇచ్చిన విధానం అత్యద్భుతం. అయితే యువరాజ్ సింగ్ క్రికెట్ కెరీర్ అర్ధాంతరంగా ముగిసింది. కారణాలు ఏవైనప్పటికీ భారత జట్టు మాజీ ఓపెనర్ రాబిన్ ఉతప్ప యువరాజ్ సింగ్ తన కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటించడానికి కోహ్లీని కారణమని సంచలన వ్యాఖ్యలు చేశాడు. 

మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప మాట్లాడుతూ " 2017లో యువరాజ్ సింగ్ భారత జట్టులోకి వచ్చాడు. అప్పుడు టీమిండియా కెప్టెన్ గా ఉంటున్న కోహ్లీ నుంచి యువరాజ్ కు సహకారం అందలేదు. ఆటగాళ్ల ఫిట్ నెస్ విషయంలో కోహ్లీ చాలా కఠినంగా ఉండేవాడు. అప్పుడే కంబ్యాక్ ఇచ్చిన యువరాజ్ సింగ్ కు పెద్దగా టైం ఇవ్వలేదు. యువరాజ్ ఫిట్నెస్ బాగానే ఉన్నప్పటికీ.. కోహ్లీ మాత్రం తన ప్రమాణాలకు తగ్గట్టుగా యువరాజ్ మారాలని ఒత్తిడి చేశాడు. యువరాజ్ లంగ్ సామర్థ్యం తక్కువగా ఉంటుంది. ఫిట్ నెస్ విషయంలో కోహ్లీ అందరినీ తనలాగే ఉండాలని కోరుకుంటాడు". అందుకే యువరాజ్ రిటైర్మెంట్ ప్రకటించాడు".అని ఉతప్ప అన్నాడు  

ALSO READ | IPL 2025: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓపెనర్స్ వీరిద్దరే.. కన్ఫర్మ్ చేసిన హెడ్ కోచ్

యువరాజ్ సింగ్ 2000 నుండి 2017 వరకు మొత్తం 402 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి 11,178 పరుగులు చేశాడు. వీటిలో 17 సెంచరీలు..  71 అర్ధ సెంచరీలు ఉన్నాయి. యువరాజ్ సభ్యుడిగా ఉన్నప్పుడు భారత్ 2022 లో ICC ఛాంపియన్స్ ట్రోఫీ..  2007 లో టీ20 ప్రపంచ కప్.. 2011 లో వన్డే వరల్డ్ కప్ గెలుచుకుంది. యువరాజ్ సింగ్ చివరిసారిగా భారత్ తరపున 2017 జూన్ లో వెస్టిండీస్‌పై మ్యాచ్ ఆడాడు.  2019లో అంతర్జాతీయ క్రికెట్‌ నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు.