Champions Trophy: అన్యాయమా..? ఎవరికీ అన్యాయం..?: ఇంగ్లాండ్ మాజీలపై ఉతప్ప ఫైర్

Champions Trophy: అన్యాయమా..? ఎవరికీ అన్యాయం..?: ఇంగ్లాండ్ మాజీలపై ఉతప్ప ఫైర్

భద్రతా కారణాల రీత్యా భారత జట్టును పాకిస్థాన్‌కు పంపేందుకు బీసీసీఐ అంగీకరించకపోవడంతో.. మన మ్యాచ్‌లు దుబాయి వేదికగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఇదే విమర్శలకు తావిస్తోంది. ఇలా ఒకే వేదికపై ఆడుతుండటం భారత జట్టుకు అడ్వాంటేజ్ అన్న విమర్శలు వస్తున్నాయి. మొదట ఈ విషయంపై అందరూ మౌనం వచించినా.. ఆఫ్గనిస్తాన్ చేతిలో ఇంగ్లాండ్ ఓటమి తరువాత.. ఆ దేశ మాజీలు ఈ విషయాన్ని వివాదాస్పదంగా మార్చేశారు. 

తాజాగా, ఈ విషయంపై భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప స్పందించారు. భౌగోళిక-రాజకీయ అంశాల కారణంగా వేదికలను ఎంచుకునే హక్కు భారతదేశానికి ఉందని చెప్పి ఒక్క మాటతో విమర్శకుల నోర్లు మూయించాడు. నిజానికి దుబాయి పిచ్‌లపై ఆడుతూ భారత క్రికెటర్లు.. ఇతర జట్ల ఆటగాళ్ల కంటే ఎక్కువ నష్టపోతున్నారని తెలిపాడు. అందుకు ఓ బలమైన పాయింట్‌ను ఈ మాజీ క్రికెటర్ ఉదాహరణగా చూపారు. 

దుబాయి పిచ్‌లు పాకిస్తాన్‌తో పోలిస్తే విభిన్నం. దాయాది దేశపు క్రికెట్ పిచ్‌లు తారు రోడ్లులా ఉంటాయి. వాటిపై పరుగులు చేయడం చాలా ఈజీ. అందువల్లే భారీ స్కోర్లు నమోదవుతుంటాయి. కానీ, దుబాయి పిచ్‌లు అందుకు విభిన్నం. స్లో పిచ్‌లు. పరుగులు చేయడం చాలా కష్టం. అందునా, బౌండరీల దూరం మరీ ఎక్కువ. స్ట్రయిట్ సిక్స్ కొట్టాలంటే 80 మీటర్లపైనే కొట్టాలి. ఇదే విషయాన్ని ఉతప్ప హైలైట్ చేశాడు.

పాకిస్తాన్ పిచ్‌లు బ్యాటర్లకు స్వర్గధామమన్న ఊతప్ప.. అటువంటి పిచ్‌లపై ఆడినట్లయితే భారత బలమైన బ్యాటింగ్ లైనప్ మరిన్ని పరుగులు సాధించేదని అభిప్రాయపడ్డాడు. దుబాయ్‌లోని పరిస్థితులకు అలవాటు పడినందున ఛాంపియన్స్ ట్రోఫీలో భారతదేశం ముందంజలో ఉన్నప్పటికీ.. స్లో పిచ్‌లపై పరుగులు చేయడం కష్టతరమని వాదించాడు.

ALSO READ : అఫ్ఘన్లను అత్యాశ దెబ్బతీస్తోంది.. మేలుకుంటే రాబోయే రోజుల్లో వారిదే పెత్తనం: డేల్ స్టెయిన్

సమర్ధించిన UAE కోచ్

ఉతప్ప వ్యాఖ్యలను ప్రస్తుత UAE ప్రధాన కోచ్ లాల్‌చంద్ రాజ్‌పుత్ ఏకీభవించారు. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు ముందంజలో ఉన్నప్పటికీ, దుబాయ్ పిచ్‌లకు పర్యాటక జట్లు త్వరగా అలవాటు పడటం అంత సులభం కాదని అన్నారు. పిచ్‌ల గురించి అతిగా ఆలోచన చేయడానికి నొక్కి చెప్పారు.

న్యూజిలాండ్‌తో ఆఖరి పోరు

ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు ఆడిన రెండింట విజయం సాధించి(గ్రూప్- బి) రెండో స్థానంలో ఉంది. టీమిండియా తదుపరి మ్యాచ్‪లో ఆదివారం న్యూజిలాండ్‌తో తలపడనుంది. ఆ మ్యాచ్‍లో విజయం సాధిస్తే, అగ్రస్థానాన్ని చేజిక్కించుకోవచ్చు.