ఐపీఎల్ లో స్టార్ ప్లేయరలు వేలల్లోకి వస్తే ఎలా ఉంటుంది..? ఈ ఆలోచన ఊహకే అందదు. ఎందుకంటే మన దేశంలో క్రికెట్ పై ఉన్న ఫాలోయింగ్ కి, స్టార్ ప్లేయర్ల క్రేజ్ కు వేలంలో ఎంత ధర పలుకుతారో చెప్పడం కష్టం. విదీశీ ఆటగాళ్ళైన స్టార్క్, కమ్మిన్స్ 20 కోట్లకు పైగా ధర పలికితే.. సామ్ కరణ్(18 కోట్లు), గ్రీన్(17.5 కోట్లు), డారిల్ మిచెల్(14కోట్లు) భారీ మొత్తంలో డబ్బు లభించింది. ఒకవేళ మన స్టార్ ప్లేయర్లకు వేలం వేయాల్సి వస్తే 100 కోట్లు పలకడం గ్యారంటీ అంటున్నాడు టీమిండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప.
"ఐపీఎల్‌లో వేతన పరిమితి లేకపోతే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్,జస్ప్రీత్ బుమ్రా 100 కోట్ల ధర పలుకుతుంది". అని ఉతప్ప న్యూస్ 24 స్పోర్ట్స్‌లో అన్నాడు. భారీగా డబ్బు ఇచ్చి స్టార్ ఆటగాళ్లను ఆయా ఫ్రాంచైజీలు రిటైన్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం కోహ్లీ ఒక సీజన్ కు 15 కోట్లు, రోహిత్ శర్మ 16 కోట్లు, బుమ్రా 12 కోట్లు, సూర్య కుమార్ యాదవ్ 8 కోట్ల చొప్పున అందుకుంటున్నారు. IPL ప్రస్తుతం ప్రతి ఫ్రాంచైజీ ఖర్చును ఒక్కో సీజన్‌కు రూ.100 కోట్లకు పరిమితం చేసింది.
ఈ నలుగురిలో రోహిత్ శర్మ, బుమ్రా, సూర్య ముంబై ఇండియన్స్ జట్టులో ఉండగా.. కోహ్లీ రాయల్ ఛాలెంజర్స్ తరపున ఆడుతున్నాడు. ఒకేవేళ ఈ నలుగురు వేలంలోకి వస్తే 30 కోట్లకు పైగానే పలికే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ ఏ ఫ్రాంచైజీ కూడా ఈ నలుగురిని వదులుకునే సాహసం చేయదు. ఇదిలా ఉంటే ఐపీఎల్ 2024 సీజన్ మరో 10 రోజుల్లో ప్రారంభం కానుంది. మార్చి 22న ఈ సీజన్ తొలి మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ తో రాయల్ ఛాలెంజర్స్ తలబడుతుంది.
Do you agree with Robin Uthappa's opinion? pic.twitter.com/uJx6lIaiWD
— CricTracker (@Cricketracker) March 12, 2024