
న్యూఢిల్లీ: ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జోస్ బట్లర్‌ను రిటైన్ చేసుకోకపోవడంపై రాజస్థాన్ రాయల్స్ జట్టుపై టీమిండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప విమర్శలు గుప్పించాడు. ఐపీఎల్ 18లో భాగంగా ఏప్రిల్ 9న గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచులో రాజస్థాన్ ఓటమి పాలైంది. జీటీ విధించిన భారీ లక్ష్యాన్ని ఛేదించలేక ఆర్ఆర్ చేతులేత్తిసింది. ఈ మ్యాచ్ ఓటమి అనంతరం ఆర్ఆర్ను టార్గెట్ చేసిన ఉతప్ప.. రాజస్థాన్ వేలం వ్యూహాన్ని ప్రశ్నించాడు.
ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జోస్ బట్లర్‌ను రిటైన్ చేసుకోకుండా మెగా వేలానికి వదిలేసి ఆర్ఆర్ తప్పు చేసింది. మ్యాచ్ ఫలితాలను తారుమూరు చేసే సత్తా ఉన్న బట్లర్ లాంటి ప్లేయర్‌ను ఎలా వదులుకుంటారని ప్రశ్నించాడు. బట్లర్‌తో పాటు టీమిండియా స్టార్ స్పిన్పర్స్ యుజ్వేంద్ర చాహల్, రవిచంద్రన్ అశ్విన్ వంటి పెద్ద స్టార్లను వదులుకుని ఆర్ఆర్ తగిన మూల్యం చెల్లించుకుంటుదన్నారు.
రిటైన్షన్ పాలసీ, మెగా వేలంలో ఆర్ఆర్ తప్పు చేసిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. జోస్ బట్లర్, అశ్విన్, చాహల్ వంటి ఆటగాళ్లను రిటైన్ చేసుకోకపోవడంతో ఆర్ఆర్ జట్టు సమతుల్యం దెబ్బ తిన్నదన్నారు. షిమ్రాన్ హెట్మైర్ ఒక్కడే ఆ జట్టులో చెప్పుకోదగ్గ విదేశీ బ్యాటర్.. అతడు గాయపడితే ఆర్ఆర్ పరిస్థితి ఏంటి అని ప్రశ్నించాడు.
ALSO READ : శని అంటే ఇదే కావొచ్చు..! ఓటమి నిరాశలో ఉన్న సంజు శాంసన్‌కు భారీ జరిమానా
కాగా, మెగా వేలానికి ముందు రాజస్థాన్ తమ ఆరు రిటెన్షన్ స్లాట్‌లను ఉపయోగించుకున్న విషయం తెలిసిందే. కెప్టెన్ సంజు సామ్సన్ (18 కోట్లు), యశస్వి జైస్వాల్ (18 కోట్లు), రియాన్ పరాగ్ (14 కోట్లు), ధ్రువ్ జురెల్ (14 కోట్లు), షిమ్రాన్ హెట్మైర్ (11 కోట్లు), సందీప్ శర్మ (4 కోట్లు)లను నిలుపుకుంది.