Hong Kong Sixes: హాంకాంగ్ సిక్సెస్ టోర్నీ.. భారత జట్టు కెప్టెన్‌గా ఉతప్ప

నవంబర్ 1 నుండి నవంబర్ 3 వరకు హాంకాంగ్‌ వేదికగా జరగనున్న హాంకాంగ్ సిక్స్‌ల క్రికెట్(Hong Kong Cricket Sixes tournament) టోర్నీకి భారత జట్టును ప్రకటించారు. టీమిండియా మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ రాబిన్ ఉతప్ప భారత జట్టుకు కెప్టెన్ గా ఎంపికయ్యాడు. కేదార్ జాదవ్, స్టువర్ట్ బిన్నీ, మనోజ్ తివారీ, షాబాజ్ నదీమ్, భరత్ చిప్లి సెలక్ట్ అయ్యారు. వికెట్ కీపర్ గా శ్రీవత్స్ గోస్వామి జట్టులో స్థానం సంపాదించాడు.

బ్యాటింగ్, బౌలింగ్‌లో పటిష్టంగా ఉన్న భారత్ ఈ టోర్నీలో రెండో టైటిల్‌ను లక్ష్యంగా చేసుకుంది. చివరిసారిగా భారత్ 2005లో హాంకాంగ్ సిక్సెస్ టోర్నీగెలుచుకుంది. చివరిసారిగా జరిగిన ఈ టోర్నీలో బ్రెయిన్ లారా, వసీం అక్రమ్, షేన్ వార్న్, సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోని, అనిల్ కుంబ్లే వంటి దిగ్గజాలు ఆడడం విశేషం.హాంకాంగ్ క్రికెట్ సిక్సెస్ అనేది ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ టోర్నమెంట్. 1992లోఈ టోర్నీని ప్రారంభించారు. 

ALSO READ : ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: తొలి టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 47 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తేడాతో పాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై గెలుపు

దక్షిణాఫ్రికా, పాకిస్తాన్, ఇంగ్లండ్ అత్యంత విజయవంతమైన జట్లు. ఒక్కొక్కటి ఐదుసార్లు టైటిల్‌ గెలుచుకున్నాయి.మొత్తం 12 జట్లు తలపడనున్న ఈ టోర్నీ మూడు రోజుల పాటు అభిమానులను అలరించనుంది. ఉదయం 8.30 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మ్యాచ్‌లు జరుగుతాయి. మ్యాచ్‍లన్నీ హాంకాంగ్ లోని టిన్ క్వాంగ్ రోడ్ క్రికెట్ గ్రౌండ్‌లో నిర్వహించనున్నారు.