రాబిన్‌హుడ్ వస్తున్నాడు.. పవన్ వెనక్కి తగ్గుతాడా..?

టాలీవుడ్ లవర్ బాయ్ నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘రాబిన్‌హుడ్‌’. ఈ సినిమాలో నితిన్ కి జంటగా యంగ్ బ్యూటిఫుల్ హీరోయిన్ శ్రీలీల నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌‌పై నవీన్ యేర్నేని, రవి శంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు. శనివారం ఈ మూవీ రిలీజ్‌ డేట్‌ను అనౌన్స్ చేశారు.  ఇందులోభాగంగా మార్చి 28న థియేటర్లలోకి తీసుకొస్తున్నట్టు తెలియజేశారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌‌లో స్పెషల్ ఏజెంట్ అవతార్‌లో డైనమిక్​గా కనిపించాడు నితిన్. 

నిజానికి ఈ చిత్రం డిసెంబర్ 25న విడుదల కావాల్సి ఉండగా అప్పట్లో వాయిదా వేశారు. ఇప్పుడిక రిలీజ్‌ డేట్ వచ్చేసింది కనుక ప్రమోషన్స్​లో స్పీడు పెంచారు మేకర్స్‌. త్వరలో కేతికా శర్మ నటించిన సెకండ్ సింగిల్‌ను విడుదల చేయబోతున్నారు. రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. 

అయితే మార్చ్ 28న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు కూడా రిలీజ్ కాబోతోంది. దీంతో ఒకేరోజున ఇద్దరి స్టార్ హీరోల సిన్మాలు రిలీజ్ కానుండటంతో థియేటర్ల విషయంలో క్లాష్ ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇప్పటికే హరిహర వీరమల్లు రిలీజ్ కావాల్సి ఉండగా పలు కారణాలవల్ల  రిలీజ్ వాయిదా పడుతూ వస్తోంది. ఈసారి కూడా పవన్ హీరోగా నటిస్తున్న మరో చిత్రం ఓజీ ఈ డేట్ కి రిలీజ్ కావాల్సి ఉంది. కానీ హరిహర వీరమల్లు కోసం ఓజీ సినిమా రిలీజ్ వాయిదా వేసుకుంది. మరో వైపు ఒక రోజు గ్యాప్ లో మార్చ్ 29న మ్యాడ్ స్క్వేర్ కూడా రిలీజ్ కాబోతోంది. దీంతో ఎవరోఒకరు కాంప్రమైజ్ కావాల్సి ఉంది.