Robinhood: నితిన్కు విలన్‌‌గా.. ఆదిపురుష్‌‌ హనుమంతుడు.. భీకరంగా ఫస్ట్ లుక్ పోస్టర్

Robinhood: నితిన్కు విలన్‌‌గా.. ఆదిపురుష్‌‌ హనుమంతుడు.. భీకరంగా ఫస్ట్ లుక్ పోస్టర్

‘ఆదిపురుష్‌‌’ చిత్రంలో హనుమంతుడి పాత్రతో మెప్పించిన హిందీ నటుడు దేవదత్త నాగే.. తెలుగులో విలన్‌‌గా బిజీ అవుతున్నాడు. ఇప్పటికే ‘దేవకీ నందన వాసుదేవ’ చిత్రంలో విలన్‌‌గా నటించిన అతను.. నితిన్ సినిమాలోనూ విలన్‌‌గా నటిస్తున్నాడు.

నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘రాబిన్‌‌ హుడ్‌‌’. బుధవారం (ఫిబ్రవరి 5) దేవదత్త నాగే పుట్టినరోజు సందర్భంగా విషెస్ చెబుతూ తన లుక్‌‌ను రివీల్ చేశారు.

Also Read :- జూనియర్ ఎన్టీఆర్ పేరుతో FIFA పోస్టర్

లాంగ్ హెయిర్, గుబురు గడ్డం, పంచె కట్టుతో భీకరంగా కనిపించాడు. శ్రీలీల హీరోయిన్‌‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ మూవీ మార్చి 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.