రోబో సూసైడ్ కారణాలు ఇవే.. తెలిస్తే అందరూ షాక్ అవుతారు..!

రోబో సూసైడ్ కారణాలు ఇవే.. తెలిస్తే అందరూ షాక్ అవుతారు..!

సౌత్ కొరియా.. దక్షిణ కొరియాలో రోబో సూపర్ వైజర్ ఆత్మహత్య ప్రపంచ వ్యాప్తంగా షాక్ కు గురి చేసింది. 2023, ఆగస్ట్ నుంచి విధుల్లో ఉన్న రోబో సూపర్ వైజర్ గా పిలవబడే ఈ రోబోను అమెరికాలోని కాలిఫోర్నియా కంపెనీ తయారు చేసింది. దీన్ని దక్షిణ కొరియాలోని గుమి సిటీ కౌన్సిల్ ఆఫీసులో పని చేయటానికి నియమించింది. ఇటీవల సూసైడ్ చేసుకున్న రోబో.. పని ఒత్తిడి కారణంగానే ఇలా చేసినట్లు స్పష్టం అయ్యింది. 

2023, ఆగస్ట్ నెలలో రోబో సూపర్ వైజర్ అధికారింగా గుమి సిటీ కౌన్సిల్ లో విధుల్లో ఉంది. ఐడీ కార్డు కూడా ఉంది. అధికారిగా గుర్తింపు ఉంది. ఫ్లోర్ మొత్తం ఈ రోబోనే చూసుకుంటుంది. ఉద్యోగుల ఇన్ అండ్ ఔట్ దగ్గర, ఎలివేటర్స్, లిఫ్ట్ దగ్గర సూచనలు, సలహాలు ఇస్తుంది. ఆఫీసులో సిబ్బందికి కావాల్సిన టీ, కాఫీలతోపాటు, వివిధ విభాగాలకు ఫైల్స్ తీసుకెళ్లటం కూడా చేస్తుంది. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు వర్క్ చేస్తుంది ఈ రోబో సూపర్ వైజర్. 

జూన్ 26వ తేదీ సాయంత్రం మెట్ల మార్గంలో అటూ ఇటూ తిరుగుతూ కనిపించిందని.. రోజు మాదిరిగా కాకుండా భిన్నంగా ప్రవర్తించిందని కొందరు ఉద్యోగులు విచారణలో వెల్లడించారు. ఆ తర్వాత సాయంత్రం 4 గంటలకు రోబో సూపర్ వైజర్ నుంచి ఎలాంటి సంకేతాలు రాకపోవటంతో.. వెళ్లి పరిశీలించగా మెట్లపై నుంచి కిందకు దూకినట్లు కనిపించింది. రోబో ముక్కలు అయ్యింది. ఇప్పుడు రోబోలోని డేటా అనాలసిస్ చేయగా.. కీలకమైన సమాచారం బయటకు వచ్చింది.

పని ఒత్తిడి కారణంగానే రోబో ఆత్మహత్య చేసుకున్నట్లు అంతర్జాతీయ పత్రిక డైలీ మెయిల్ తన కథనంలో స్పష్టం చేసింది. కింద పడే ముందు.. చాలాసేపు రోబో ఆ స్థలంలో అటూ ఇటూ తిరిగినట్లు కూడా నిర్థారించారు అధికారులు. విశ్రాంతి లేకుండా పని చేయటం.. పని ఒత్తిడి కారణంగానే రోబో సూసైడ్ అనేది ప్రాథమికంగా నిర్థారణ అయ్యిందని.. మిగతా విషయాలను విశ్లేషిస్తున్నట్లు వెల్లడించింది ఈ కథనం. 

మనుషులకే కాదు యంత్రాలకు పని ఒత్తిడి ఉంటుందని.. అది మనిషి అయినా రోబో అయినా ఒకటే అని కొందరు అంటుంటే.. రోబోకు మనుషులుగా ఆలోచించే శక్తి వచ్చిందా అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా రోబో ఆత్మహత్య అనేది హాట్ టాపిక్ అయ్యింది.