రోబో జర్నలిస్ట్ : వార్తలు రాసే మర మనుషులు

రోబో జర్నలిస్ట్ : వార్తలు రాసే మర మనుషులు

ఇప్పటికే వాడుతున్న బ్లూ మ్‌ బర్గ్‌ , ఏపీ, గార్డియన్‌

బ్లూమ్‌ బర్గ్‌ వార్తల్లో మూడో వంతు మెషీన్‌ జనరేటెడే

ట్రాన్స్‌ లేషన్‌ కు రోబోల కోసం వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ ప్రయత్నం

పరిశ్రమల్లో పని చేసే రోబోలను చూశాం, వైద్యంలో సాయం చేసే మర మనుషుల గురించి విన్నాం, యుద్ధభూమిలో ప్రతాపం చూపించే రోబోల గురించి తెల్సుకున్నాం.. మొన్నామధ్య వార్తలు చదివే రోబో (పేరు క్యు హావ్‌ ) గురించి కూడా చదివాం. ఇప్పుడీ రోబోలు జర్నలిజంలోకీ అడుగుపెట్టాయి. రిపోర్టర్లు రాసే వార్తలను తామూ రాస్తామంటున్నాయి. వాళ్లు కూడా అవాక్కయ్యేలా న్యూస్‌‌‌‌ను తీర్చిదిద్దుతామని చెబుతున్నాయి.

డిజిటల్‌‌‌‌ ప్రపంచం నానాటికీ విస్తరిస్తోంది. తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ వెబ్‌‌‌‌సైట్లలో ప్రత్యక్షమవుతున్నాయి. దీంతో ప్రింట్‌‌‌‌మీడియాపై ఒత్తిడి పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో రోబోలు జర్నలిజంలోకి వచ్చేస్తున్నాయి. ఇప్పటికే బ్లూ మ్‌ బర్గ్‌‌‌‌, వాషిం గ్టన్‌‌‌‌ పోస్ట్‌‌‌‌, లాస్‌‌‌‌ ఏంజిలెస్‌‌‌‌ టైమ్స్‌‌‌‌, గార్డి యన్‌‌‌‌ లాంటి పెద్ద పెద్ద వార్తా సంస్థలు వార్తలు రాయడంలో రోబోల సాయం తీసుకుంటున్నాయి. వార్తలను క్షణాల్లో పాఠకులకు అందిస్తున్నాయి. భారీగా లాభాలు గడిస్తున్నాయి. అన్నింటి చూపూ అటువైపే

బ్లూమ్‌ బర్గ్‌‌‌‌ వార్తా సంస్థ ఇప్పటికే రోబో టెక్నాలజీని వాడుతోంది. అందులో వచ్చే వార్తల్లో మూడో వంతు మెషీన్లు రాసేవే. రిపోర్టర్లు రాసే వేలాది వార్తలకు ఈ ‘సైబోర్జ్‌ (సైబర్మేటిక్‌‌‌‌ ఆర్గాని జం)’ వ్యవస్థ సహకరిస్తోంది. ముఖ్యంగా బిజినెస్‌‌‌‌ వార్తలు రాయడంలో ఇది ఎంతో ఉపయోగపడుతోంది. చిన్న బిజినెస్‌‌‌‌ వార్త వచ్చిందంటే వెంటనే చక్కని వార్తగా మలిచేస్తుంది. బిజినెస్‌‌‌‌ రిపోర్టులు రాయడానికి తడబడే వార్తలను అద్భుతంగా గణాంకాలతో సహా అందిస్తుంది. పైగా అలసిపోదు, ఎదురు మాట్లాడదు, ఎప్పుడూ పని.. పని.. పని చేస్తూనే ఉంటుంది. పోటీ వెబ్‌‌‌‌సైట్‌‌‌‌ రాయిటర్స్‌‌‌‌తో పోటీ పడేందుకు బ్లూమ్‌ బర్గ్‌‌‌‌కు ఈ సైబోర్గ్‌‌‌‌ ఎంతో సహకరిస్తోంది. మరిన్ని వార్తా సంస్థలూ రోబో రిపోర్టర్లను ఇప్పటికే వాడేస్తున్నా యి. ఈమధ్య ఓ చిన్న బేస్‌‌‌‌బాల్‌‌‌‌ లీగ్‌‌‌‌కు సంబంధించి న వార్తలను కవర్‌‌‌‌ చేయడంలో అసోసి యేట్‌‌‌‌ ప్రెస్‌‌‌‌కు, ఓ హైస్కూల్‌‌‌‌ ఫుట్‌‌‌‌బాల్‌‌‌‌ టోర్నమెంట్‌‌‌‌ కోసం వాషింగ్టన్‌‌‌‌ పోస్ట్‌‌‌‌కు, భూకంపా ల సమయంలో లాస్‌‌‌‌ ఏంజిలెస్‌‌‌‌ టైమ్స్‌‌‌‌కు ఇవి సహకరించాయి. గతేడాది గార్డియన్‌‌‌‌ కూడా తొలి రోబో ఆర్టికల్‌‌‌‌ను ప్రచురించింది. ఫోర్బ్స్‌ కూడా ఈ ప్రయత్నాల్లోనే ఉన్నట్టు ఇటీవల ప్రకటించింది.

తొలిసారి అసోసియేట్‌‌‌‌ ప్రెస్‌‌‌‌

తొలిసారి 2014లో జర్నలిజంలోకి రోబోను అసోసియేట్‌‌‌‌ ప్రెస్‌‌‌‌ తీసుకొచ్చింది. దీనికోసం ఆటోమేటెడ్‌‌‌‌ ఇన్‌‌‌‌సైట్స్‌‌‌‌ టెక్నాలజీ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. ఆ సంస్థ వేలకొద్దీ వార్తలను సృష్టించే లాంగ్వేజ్‌‌‌‌ జనరేషన్ సాఫ్ట్‌‌‌‌వేర్‌‌‌‌ను తయారు చేసి ఏపీకి ఇచ్చింది. కంపెనీల లాభాలకు సంబంధించిన బిజినెస్‌‌‌‌ వార్తలు రాయడంలో సాఫ్ట్‌‌‌‌వేర్‌‌‌‌ను ఎక్కువగా వాడుతున్నారు. ఒకప్పుడు 300 వార్తలను రాసిన ఏపీ.. ఇప్పుడు సాఫ్ట్‌‌‌‌వేర్‌‌‌‌ సాయంతో 3,700 వార్తలు రాస్తోంది. వార్తలు రాసేందుకు ఓ ఇన్‌‌‌‌హౌస్‌‌‌‌ రోబో (పేరు హెలిగ్రాఫ్‌‌‌‌)ను కూడా ఏపీ పెట్టేసుకుంది. 2016లో జరిగిన సమ్మర్‌‌ ఒలింపిక్‌‌‌‌ గేమ్స్‌‌‌‌ వార్తలను ఈ రోబో బాగా రాసింది. 2016 ఎన్నికలను సూపర్‌‌‌‌గా కవర్‌‌‌‌ చేసింది. పనిలో రోబోలను సమర్థం గా వాడుకున్నందుకు గ్లోబల్‌‌‌‌ బిగ్గీస్‌‌‌‌ అవార్డ్స్‌ ‘ఎక్సలె న్స్‌‌‌‌ ఇన్‌‌‌‌ యూజ్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ బోట్స్‌‌‌‌’ కూడా

ఏపీ పొందింది. స్థానిక రాజకీయ వార్తలను విడదీసి ప్రాంతాలవారీగా పాఠకులకు అందించేందుకు ఆర్టిఫిషియల్‌‌‌‌ ఇంటెలిజన్స్‌‌‌‌ను కూడా వాడుకుంటున్నామని ఏపీ చెబుతోంది. రోబోలు రాసే చిన్న చిన్న వార్తలకు సంబంధించి అలర్ట్‌‌‌‌ పద్ధతిని కూడా ఏపీ ప్రవేశపెట్టింది. ఆ అలర్ట్‌‌‌‌లను రిపోర్టర్లు చూసి పెద్ద వార్తలు రాసే అవకాశం ఉంటే డెవలప్‌‌‌‌ చేస్తారు.

ఉద్యోగాలేం పోవు

ఇంటర్వ్యూలను ఇతర భాషల్లోకి తర్జుమా చేసే పనిని రోబోలకు అప్పగించడంపై ప్రయత్నాలు మొదలెట్టినట్టు వాల్‌‌‌‌స్ట్రీట్‌‌‌‌ జర్నల్‌‌‌‌, డోజోన్స్‌‌‌‌ వెల్లడించాయి. న్యూయార్క్‌‌‌‌ టైమ్స్‌‌‌‌ మాత్రం వార్తలు రాయడంలో మెషీన్ల ఉపయోగంపై తామేం నిర్ణయం తీసుకోలేదని చెప్పింది. ఏఐ, రోబోల వల్ల మనుషుల ఉద్యోగాలేం పోవని జర్నలిజం ఎగ్జిక్యూ టివ్స్‌‌‌‌ అంటున్నారు. న్యూస్‌‌‌‌రూమ్‌ పనిని ఆక్రమించుకోబోవని చెబుతున్నారు. కానీ ఏఐ వల్ల పని మరింత సులువవుతుందని అంటున్నారు. ‘జర్నలిజం సృజనాత్మక, ఉత్సు కత కలిగించే ఉద్యోగం. వార్తను చెప్పడం. ప్రభుత్వంలోని లోటుపాట్లను వేలెత్తి చూపడం, మంచి పనులను ప్రశంసించడం. విమర్శనాత్మకంగా ఆలోచించడం’ అని చెబుతున్నారు.

ఏదేమైనా వార్తల ప్రింటింగ్‌‌‌‌లో ఎప్పటికప్పుడు అప్‌‌‌‌డేట్‌‌‌‌ అవుతున్న పత్రికలు.. వార్తలు రాసేందుకు రోబోల వాడకంపై ఇప్పటికిప్పుడు దృష్టి పెట్టే అవకాశమైతే లేనట్టేనని పలువురు అభిప్రాయపడుతున్నారు.