మహిళా రిపోర్టర్‌తో రోబో మిస్ బిహేవ్

రియాద్: ఓ సౌదీ అరేబియా తొలి మేల్ రోబో ‘ముహమ్మద్’ ఓ మహిళా రిపోర్టర్‌తో మిస్ బిహేవ్ చేసింది. సౌదీలోని రియాద్‌లో  సోమవారం  డీప్‌ఫెస్ట్ లైవ్ ఈవెంట్‌లో ఈ ఘటన జరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్ మెంట్ లో భాగంగా సౌదీ అరేబియా ఈ మేల్ రోబోను తయారు చేసింది. ప్రజల సందర్శనార్థం ముహమ్మద్‌ను సోమవారం ఈవెంట్‌కు తీసుకొచ్చారు. రావియా అల్-ఖాసిమి అనే మహిళా రిపోర్టర్ రోబో పక్కన నిలబడి లైవ్ స్టార్ట్ చేశారు. ఆ సమయంలో రిపోర్టర్‌ను రోబో తన చేయితో వెనకనుంచి అసభ్యంగా తాకింది. ఈ ఘటనతో ఆమె ఒక్కసారిగా షాక్ అయ్యారు. వెంటనే తేరుకుని మళ్లీ రిపోర్టింగ్ కొనసాగించారు.

 ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో  రోబోను తయారు చేసినవారిపై నెటిజన్లు మండిపడుతున్నారు. దానికి మహిళలకు రెస్పెక్ట్ ఇవ్వడం నేర్పించాలని అంటున్నారు. ఏఐకి ఎవరు శిక్షణ ఇచ్చారని ఒకరు ప్రశ్నించగా.. మరికొంత మంది నెటిజన్లు రోబోను సమర్థించారు. అది కావాలని చేయలేదని అంటున్నా రు. కాగా.. రోబో కావాలని మహిళతో అనుచితంగా ప్రవర్తించలేదని, తన ప్రోగ్రామింగ్ లోపం కారణంగా ఈ ఘటన జరిగి ఉండవచ్చని ఏఐ ఎక్స్ పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు.