అత్యాధునిక, అత్యంత ఖరీదైన రోబోటిక్ సర్జికల్ సిస్టమ్‌ను నిమ్స్ ఆస్పత్రిలో వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. సోమవారం(జులై3) నిమ్స్‌కు వెళ్లిన మంత్రి హరీశ్ రావు.. నిమ్స్‌లో రోబోటిక్ యంత్రాన్ని ప్రారంభించి, పరిశీలించారు. ఆ యంత్రం ద్వారా చేయనున్న సర్జరీలకు సంబంధించిన పలు విషయాలను తెలుసుకున్నారు. ఎలాంటి ఆపరేషన్లు.. ఎలా నిర్వహిస్తారో మంత్రి హరీశ్ రావుకు వైద్యులు వివరించారు. నిమ్స్ ఆస్పత్రిలో కొత్త ఎక్విప్‌మెంట్ కోసం సీఎం కేసీఆర్ రూ.153 కోట్లు కేటాయిస్తే.. పలు యంత్రాలు కొనుగోలు చేశామని మంత్రి హరీశ్ రావు అన్నారు.
నిమ్స్ లో కొత్త బ్లాక్ నిర్మాణం
నిమ్స్ లో కొత్త బ్లాక్ నిర్మాణానికి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. మరో వారం, 10 రోజుల్లో కొత్త నిమ్స్ బ్లాక్ నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని మంత్రి హరీశ్ రావు అన్నారు. అది కూడా పూర్తయితే నిమ్స్‌లో 2వేల పడకలు అందుబాటులోకి వస్తాయి. అప్పుడు అది దేశంలోనే ప్రభుత్వ రంగంలో అతిపెద్ద ఆసుపత్రిగా మారిపోతుందని మంత్రి చెప్పారు. కొంతమంది రాజకీయ నాయకులు.. ప్రభుత్వం నిమ్స్‌ను నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపణలు చేస్తుంటారు. కానీ అది నిజం కాదన్నారు.
కొంతమందికి హాఫ్ నాలెడ్జ్..
తెలంగాణ ఏర్పడ ముందు నిమ్స్ కంటే.. ఇప్పుడు ఎంత అభివృద్ధి జరిగిందో అందరూ గమనిస్తూ ఉన్నారు. ఒకప్పుడు నిమ్స్‌పై చిన్న చూపు ఉండేది. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం దీనిపై ప్రత్యేక శ్రద్ద పెట్టింది. కాని కొంతమంది హాఫ్ నాలెడ్జ్ తో మాట్లాడుతున్నారంటూ విపక్ష నేతలను విమర్శించారు. కొందరికి మంచి కనబడదు, వినపడదు, మాట్లాడరు అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తునన్నారు మంత్రి హరీశ్ రావు. ప్రభుత్వం లో ఉన్నతపదవిలో ఉండి పిచ్చి పిచ్చి గా మాట్లాడుతారు వాళ్ళను ఆ దేవుడే చూసుకుంటాడన్నారు.
ALSO READ:ఉస్మానియా ఆసుపత్రిలో పరిస్థితి దారుణం....కొత్త భవనం నిర్మించాల్సిందే
దేశంలోనే పెద్ద డయోగ్నస్టిక్ సెంటర్
ఆలిండియా ర్యాంకర్లు కూడా నిమ్స్‌లో చదవాలనే ఆసక్తితో ఉన్నారు. కొంతమందికి అవగాహన లేక అలాంటి ఆరోపణలు చేస్తుంటారని మంత్రి హరీశ్ రావు అన్నారు. పేదల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం ఫోకస్ చేసింది. కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని పేదలకు అందించాలనే నిమ్స్‌ను బలోపేతం చేస్తున్నామన్నారు. రోబోటిక్ యంత్రం వల్ల పేదలకు మంచి వైద్యం అందడమే కాకుండా.. డాక్టర్లకు కూడా ఎంతో ఉపయోగపడుతుందని హరీశ్ రావు అన్నారు. దేశంలోనే అతి పెద్ద డయోగ్నస్టిక్ సెంటర్ నిమ్స్ లో ఉందని మంత్రి తెలిపారు. తక్కువ సమయంలో, రక్తస్రావం లేకుండా సర్జరీలు నిర్వహించవచ్చు. దీంతో వైద్యులో రోజులో మరో రెండు ఆపరేషన్లు చేసే అవకాశం ఉంటుందని హరీశ్ రావు అన్నారు.నిమ్స్‌కు విడుదల కావల్సిన ఆరోగ్యశ్రీ నిధులు కూడా వెంటన విడుదల చేయాలని సీఈవోను ఆదేశించారు. నిమ్స్‌లో ఇంత ఖర్చు పెట్టి రోబోటిక్ యంత్రాన్ని కొనడంతో కార్పొరేట్ ఆసుపత్రులు కూడా కంగారు పడుతున్నాయి. అంత ఖర్చు పెట్టి ప్రభుత్వ ఆసుపత్రులు యంత్రాలు కొనడం ఏంటని నిమ్స్ డైరెక్టర్ బీరప్పకు చాలా మంది కాల్స్ చేస్తున్నారని మంత్రి చెప్పారు. హెల్త్ సెక్టార్‌లో మనం దేశంలో నెంబర్ 3లో ఉన్నాము. త్వరలోనే దేశంలోనే నెంబర్ 1గా మారాలనే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని హరీశ్ రావు చెప్పారు