ఇండియా నుంచి 51 లక్షల బండ్ల ఎగుమతి

ఇండియా నుంచి 51 లక్షల బండ్ల ఎగుమతి

న్యూఢిల్లీ: కిందటేడాది ఇండియా నుంచి 50,98,810 బండ్లు ఎగుమతి అయ్యాయి. టూవీలర్లు, ప్యాసింజర్ వెహికల్స్‌‌‌‌‌‌‌‌ (కార్లు), కమర్షియల్ వెహికల్స్‌‌‌‌‌‌‌‌ ఎగుమతులు పెరగడంతో మొత్తం ఆటోమొబైల్ ఎక్స్‌‌‌‌‌‌‌‌పోర్ట్స్‌‌‌‌‌‌‌‌ ఏడాది ప్రాతిపదికన 19 శాతం  పెరిగాయి. 2023 లో  42,85,809 బండ్లను ఎగుమతి చేశాం. 

సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్‌‌‌‌‌‌‌‌ (సియామ్‌‌‌‌‌‌‌‌)  డేటా ప్రకారం, 2023 తో పోలిస్తే 2024 లో ప్యాసింజర్ వెహికల్స్ ఎగుమతులు 10 శాతం పెరిగి 7,43,976 యూనిట్లకు చేరుకోగా, ఇందులో కార్ల వాటా  4,12,148 బండ్లుగా ఉంది.  యుటిలిటీ వెహికల్స్ ఎగుమతులు 33 శాతం పెరిగి 3,23,621  యూనిట్లకు పెరగగా, టూవీలర్ ఎగుమతులు 23 శాతం పెరిగి 39,77,162 యూనిట్లుగా రికార్డయ్యాయి.