అఫీషియల్: నాని కోసం హిట్ మ్యూజిక్ డైరెక్టర్ ని దింపుతున్న శ్రీకాంత్ ..

అఫీషియల్: నాని కోసం హిట్ మ్యూజిక్ డైరెక్టర్ ని దింపుతున్న శ్రీకాంత్ ..

నేచురల్ స్టార్ నాని, యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం "ది ప్యారడైస్". ఈ సినిమాని ప్రముఖ సినీ నిర్మాత సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం ది ప్యారడైస్  సినిమా హైదరాబాద్ పరిసర ప్రాంతంలో షూటింగ్ జరుపుకుంటోంది. గత ఏడాది హీరో నాని సరిపోదా శనివారం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు . దీంతో హిట్ ట్రాక్ ట్రాక్ కంటిన్యూ చేసేందుకు బాగానే శ్రమిస్తున్నాడు. 

ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా తమిళ్ స్టార్ డైరెక్టర్ అనిరుద్ ని సెలక్ట్ చేసినట్లు మేకర్స్ సోషల్ మీడియా వేదికగా అనౌన్స్ చేశారు. ఇందులోభాగంగా ఈ విషయానికి సంబంధించిన పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ ని హీరో నాని ట్విట్టర్ లో షేర్ చేస్తూ "మనం హ్యాట్రిక్ దిశగా ఉన్నాము.. ఇది ఎపిక్ అవుతుంది. ప్రియమైన అనిరుద్ కి స్వాగతం" అంటూ ట్వీట్ చేశాడు. దీంతో నాని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. గతంలో అనిరుద్ నానితో కలసి రెండు సినిమాలకి పని చేశాడు. ఈ క్రమంలో అనిరుద్ నాని హీరోగా నటించిన జెర్సీ, గ్యాంగ్ లీడర్ సినిమాలకు మ్యూజిక్ అందించగా సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. బీజీయం కూడా బాగానే వర్కౌట్ అయ్యింది. ఈ కారణంగానే అనిరుద్ ని ది ప్యారడైస్ సినిమాకోసం సెలక్ట్ చేసినట్లు తెలుస్తోంది. 

అయితే ప్రస్తుతం అనిరుద్ మోస్ట్ బిజీయెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఉన్నాడు. ఇటీవల అనిరుద్ మ్యూజిక్ ఇచ్చిన దేవర పార్ట్ 1, జైలర్ పార్ట్ 1, వేట్టైయాన్ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. ముఖ్యంగా ఎలివేషన్ సీన్స్ లో మాస్ బీజియంతో ఆడియన్స్ కట్టి పడేస్తున్నాడు. దీంతో అనిరుద్ కి సౌత్, నార్త్ లో భారీ క్రేజ్ వచ్చింది. ప్రస్తుతం ఒక్కో సినిమాకి దాదాపుగా రూ.10 నుంచి రూ.12 కోట్లు రెమ్యునరేషన్ అందుకుంటున్నట్లు సమాచారం.