ToxicTheMovie: యష్ బర్త్డే స్పెషల్.. యాక్షన్-ప్యాక్డ్ మాఫియా థ్రిల్లర్‌గా టాక్సిక్ గ్లింప్స్

ToxicTheMovie: యష్ బర్త్డే స్పెషల్.. యాక్షన్-ప్యాక్డ్ మాఫియా థ్రిల్లర్‌గా టాక్సిక్ గ్లింప్స్

‘కేజీఎఫ్‌’ స్టార్ హీరో యష్ (Yash) నటిస్తున్న లేటెస్ట్ మూవీ టాక్సిక్ (ToxicTheMovie). ఇది అతని కెరిర్ లో 19వ సినిమాగా తెరకెక్కుతోంది. నేడు జనవరి 8న యష్ బర్త్డే స్పెషల్గా టాక్సిక్ బర్త్‌డే పీక్ పేరుతో వీడియో రిలీజ్ చేశారు. పాతకాలం నాటి కారులోంచి యష్ దిగి.. క్యాప్ పెట్టుకొని నిలబడి స్టైలిష్ గా సిగరెట్ కాలుస్తూ ఉన్నాడు. ఆ తర్వాత పబ్ లోకి వెళ్తూ.. మత్తులో చిల్ అవుతున్న ఓ అమ్మాయిపై బీర్ పోస్తూ రొమాన్స్ చేస్తాడు. అపుడొచ్చే యష్ లుక్స్ సినిమాపై ఆసక్తి కలిగించాయి. 

 'కేజీఎఫ్' తరహాలోనే ఇందులో కూడా యష్ పవర్ ఫుల్ క్యారెక్టర్లో కనిపించబోతున్నట్లు అర్ధమవుతోంది. అయితే, ఈ మూవీ గోవాలో ఉన్న డ్రగ్ కార్టెల్ చుట్టూ నడిచే యాక్షన్-ప్యాక్డ్ మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్నట్లు సమాచారం.1950ల నుంచి 1970ల మధ్య కాలానికి సంబంధించిన కథతో తెరకెక్కనుంది. అందుకు తగ్గట్టుగానే సెట్స్ డిజైన్ రిలీజ్ చేసిన పోస్టర్స్, విజువల్స్ లో కనిపిస్తున్నాయి. 

ALSO READ : DaakuMaharaj: మా సినిమాకు టికెట్ రేట్ల పెంపు అవసరం లేదు.. ప్రొడ్యూసర్ నాగ వంశీ కామెంట్స్ వైరల్
 
మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్(Geethu Mohandas) డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీపై భారీగా అంచనాలున్నాయి. కేవీఎన్ సంస్థ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమా 2025 ఏప్రిల్‌ 10న విడుదల చేసేందుకు మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారు.

ఈ మూవీలో యష్ కి జోడీగా కియారా అద్వానీ నటిస్తోంది. ఇదే తనకు కన్నడ సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ. సిస్టర్ సెంటిమెంట్ ఈ చిత్రంలో హైలైట్ గా ఉండబోతోందని సినీ వర్గాల్లో చర్చ వినిపిస్తోంది. యష్ కి అక్కగా హ్యూమా ఖురేషి కనిపించబోతున్నట్లు టాక్. త్వరలో ఈ మూవీ నుంచి మరిన్ని వివరాలు ప్రకటించే అవకాశం ఉంది.