యష్ కొత్త సినిమా టాక్సిక్.. అదిరిపోయిన టైటిల్ వీడియో

యష్ కొత్త సినిమా టాక్సిక్.. అదిరిపోయిన టైటిల్ వీడియో

కేజీఎఫ్(Kgf) తరువాత కన్నడ హీరో యశ్(Yash) చేయబోయే సినిమా కోసం ఆడియన్స్, మెయిన్ గా ఆయన ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అంతేకాదు యష్ చేయబోయే సినిమాపై కూడా చాలా రూమర్స్ వచ్చాయి. ఆ డైరెక్టర్, ఈ డైరెక్టర్ అని చాలా వార్తలు వినిపించాయి. దీంతో డైరెక్ట్ గా రంగంలోకి దిగి తన నెక్స్ట్ సినిమాపై త్వరలోనే రానుందని క్లారిటీ ఇచ్చే పరిస్తతి వచ్చింది. దాంతో ఆయన ఫ్యాన్స్ కాస్త ఖుషీ ఫీల్ అయ్యారు. 

చెప్పినట్టుగానే తాజాగా తన తరువాతి సినిమా క్రేజీ అప్డేట్ ఇచ్చాడు రాకింగ్ స్టార్ యష్. ఆయన నుండి వస్తున్న సినిమా టైటిల్ రివీల్ చేస్తూ వీడియో రిలీజ్ చేశారు. యష్ కెరిర్ లో 19వ సినిమాగా వస్తున్న ఈ ప్రాజెక్టుకు టాక్సిక్(Tixic) అనే మాసీవ్ టైటిల్ ను ఫిక్స్ చేశారు మేకర్స్. కేవీఎన్ సంస్థ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమాకు మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్(Geethu Mohandas) డైరెక్ట్ చేయబోతున్నారు. ఇక రెగ్యులర్ షూటింగ్ మొదలుకానీ ఈ సినిమా రిలీజ్ డేట్ ని కూడా అనౌన్స్ చేసేశారు మేకర్స్. ఈ సినిమా 2025 ఏప్రిల్ 10న రిలీజ్ కానున్నట్లు వీడియోలో ప్రకటించారు. ఈ ఒక్క వీడియో సినిమాపై ఇప్పటినుండే భారీ అంచనాలను పెంచేసింది. మరి కేజీఎఫ్ తరువాత యష్ నుండి వస్తున్న ఈ సినిమా ఎన్ని కొత్త రికార్డ్స్ క్రియెస్ట్ చేస్తుందో చూడాలి.