అఫీషియల్: నాని మూవీకి మోస్ట్ వాంటెడ్ అనిరుధ్ రవిచందర్.. స్పీకర్లు పగిలిపోవడం ఖాయం!

అఫీషియల్: నాని మూవీకి మోస్ట్ వాంటెడ్ అనిరుధ్ రవిచందర్.. స్పీకర్లు పగిలిపోవడం ఖాయం!

అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichandar).. ప్రస్తుతం సోషల్ మీడియాలో మొత్తం ఇదే పేరు ట్రెండ్ అవుతోంది. తన ఎలక్ట్రిఫయింగ్ మ్యూజిక్ తో మ్యాజిక్ చేస్తూ.. ఆడియన్స్ ను మెస్మరైజ్ చేస్తున్నాడు. మనిషి చూడటానికి సన్నగా ఉంటాడు కానీ.. ఒక్కసారి మ్యూజిక్ ఇస్స్తే అంతే.. స్పీకర్లు పగిలిపోవడం ఖాయం. 

లేటెస్ట్ విషయానికి వస్తే.. సెన్సేషనల్ అనిరుధ్ రవిచందర్ ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఉన్నారు. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ఇలా ప్రతి ఇండస్ట్రీకి ఇతను బాగా కావాల్సిన వాడిగా మారాడు. రీసెంట్ టైమ్స్ లో దేవర, వెట్టయన్ సినిమాలతో టాలీ, కోలీవుడ్ ఆడియన్స్ కి బూస్ట్ ఇచ్చిన అనిరుధ్.. మరో క్రేజీ ప్రాజెక్టు తో రానున్నాడు. 

నేచురల్ స్టార్ నాని (Nani) , దసరా ఫేమ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల మూవీకి (Nani Odela 2) మూవీకి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందించనున్నారు. ఈ విషయంపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వచ్చేసింది. బుధవారం (అక్టోబర్ 16న) అనిరుధ్ పుట్టిన రోజు సందర్భంగా ఓ పోస్టర్ పోస్ట్ చేస్తూ విషెష్ తెలిపారు. ఈ మేరకు 'హ్యాపీ బర్త్‌డే రాక్ స్టార్.. కొన్ని సంవత్సరాలుగా మీ నుండి వస్తోన్న చార్ట్‌బస్టర్‌ సంగీత సంచలనాలకు ధన్యవాదాలు.. వెల్ కం Nani Odela 2 ' అంటూ వెల్లడించారు. దాంతో నాని ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.

ప్రస్తుతం నాని వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. హ్యాట్రిక్స్ హిట్స్ కొట్టేసి మస్త్ జోష్ లో ఉన్నారు. గతేడాది దసరా, హాయ్ నాన్న ఇటీవలే ‘సరిపోదా శనివారం’ చిత్రంతో  బ్లాక్‍బస్టర్ హిట్స్ సొంతం చేసుకున్నాడు. ఇక ఇదే ఊపులో దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో తెరకెక్కబోయే సినిమాలో మరోసారి పవర్ ఫుల్ రోల్ చేయనున్నాడు. ఇప్పటికీ ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ క్రమంలో అనిరుధ్ తోడవ్వడంతో మరింత హైప్ వచ్చేసింది. 

ఇకపోతే నానితో మూడోసారి అనిరుధ్ రవిచందర్ పనిచేయబోతున్నాడు. గ్యాంగ్ లీడర్, జెర్సీ సినిమాలకు తనదైన ఎలెక్ట్రిఫయింగ్ ట్యూన్స్ ఇచ్చి ఆకట్టుకున్నాడు. ఇప్పుడు మూడోసారి నాని మూవీ కోసం అనిరుధ్ ఎలాంటి ఇంటెన్స్ యాక్షన్ ట్యూన్స్ ఇవ్వనున్నాడో చూడాలి.

ఈ మూవీ నాని కెరియర్ లో 33వ సినిమాగా రాబోతుంది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ (SLV Cinemas) లో తొమ్మిదవ సినిమాగా తెరకెక్కనుంది. ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ను మేకర్స్ త్వరలో అనౌన్స్ చేసే అవకాశం ఉంది.