తండేల్ సాంగ్స్ కి వచ్చిన అద్భుతమైన రెస్పాన్స్ చాలా ఆనందాన్ని ఇచ్చింది : దేవిశ్రీ ప్రసాద్

తండేల్ సాంగ్స్ కి వచ్చిన అద్భుతమైన రెస్పాన్స్ చాలా ఆనందాన్ని ఇచ్చింది : దేవిశ్రీ ప్రసాద్

తండేల్ సాంగ్స్‌‌కి వచ్చిన రెస్పాన్స్ చాలా ఆనందాన్ని ఇచ్చిందని మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ అన్నాడు. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా చందూ మొండేటి రూపొందించిన ఈ చిత్రానికి దేవిశ్రీ సంగీతం అందించాడు. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించిన ఈ మూవీ ఫిబ్రవరి 7న విడుదలవుతోంది. ఈ సందర్భంగా సినిమాలోని సాంగ్స్ గురించి దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ ‘ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు చార్ట్ బస్టర్ హిట్స్‌‌గా నిలిచి ట్రెండింగ్‌‌లో నిలవడం హ్యాపీ.  

చాలా రోజుల తర్వాత వస్తున్న లవ్ స్టోరీ ఇది.  బుజ్జి తల్లి పాటకి  మంచి రెస్పాన్స్ వచ్చింది. సుకుమార్ గారు పాట విని నీ ఆల్ టైం టాప్ ఫైవ్‌‌లో ఉంటుందని చెప్పారు. అలాగే శివుని పాట, హైలెస్సో పాటలు గొప్పగా జనాల్లోకి వెళ్ళాయి. ఆడియెన్స్ సాంగ్స్‌‌ని చాలా ఎంజాయ్ చేస్తున్నారు. రాబోయే పాటలు కూడా  బాగుంటాయి. బ్యాక్‌‌గ్రౌండ్ స్కోరు చాలా ఫ్రెష్‌‌గా ఉంటుంది.  నేను అన్ని జానర్ చిత్రాలకు సంగీతం అందిస్తాను. కానీ  ప్రేమ కథలు ఎవర్ గ్రీన్. అందరూ రిలేట్ చేసుకునేలా ఉంటాయి. అందుకే  ప్రేమ పాటలు ఎక్కువ కాలం 
నిలబడతాయి.