- కార్టియేకు జలక్ ఇచ్చిన మెక్సికో వ్యక్తి
న్యూఢిల్లీ: వెబ్‌సైట్‌లో ధర తప్పుగా పడడంతో రూ.11.35 లక్షల విలువైన డైమండ్, గోల్డ్ కార్టియే ఇయర్ రింగ్స్‌ను కేవలం రూ. 1,080 కే దక్కించుకున్నాడో ఓ లక్కీ ఫెలో. మెక్సికోకి చెందిన రోజెలియో విలారియల్ జాస్సోకి భారీ డిస్కౌంట్‌తో కార్టియే ఇయర్ రింగ్స్ ఆన్‌లైన్‌లో కనిపించాయి. కిందటేడాది డిసెంబర్ 1 న కేవలం 13 డాలర్ల (రూ.1,080) కే కార్టియే ఇయర్ రింగ్స్ యాడ్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో చూశానని, ఆర్డర్ పెట్టానని ఆయన పేర్కొన్నారు.
కొన్ని రోజులకు కార్టియే నుంచి కాల్ వచ్చిందని, ఆన్‌లైన్‌లో ధర సరిగ్గా లేకపోవడంతో ఆర్డర్‌ను క్యాన్సిల్ చేస్తున్నామన్నారని పేర్కొన్నారు. కానీ, జాస్సో మాత్రం కార్టియే మెక్సికో సైట్‌లోని టెర్మ్స్ అండ్ కండిషన్స్ చదివానని, ఆర్డర్‌ను క్యాన్సిల్ చేస్తే ఫెడరల్ కోర్టుకి వెళతానని బెదిరించాడు. న్యూయార్క్ టైమ్స్ రిపోర్ట్ ప్రకారం, జాస్సో ఫెడరల్ కన్జూమర్ ప్రొటెక్షన్ కోర్టులో కేసు వేశాడు. చివరికి జాస్సోతో కార్టియే సెటిల్‌మెంట్ కుదుర్చుకుంది. ఈ ఇయర్స్ రింగ్స్ డెలివరీ అయ్యాయని జాస్సో తాజాగా పేర్కొన్నారు.