డబ్ల్యూపీఎల్‌‌‌‌ కమిటీ హెడ్‌‌‌‌గా రోజర్‌‌‌‌ బిన్నీ

న్యూఢిల్లీ :  విమెన్స్‌‌‌‌ ప్రీమియర్‌‌‌‌ లీగ్‌‌‌‌ (డబ్ల్యూపీఎల్‌‌‌‌)ను మరింత మెరుగుపర్చేందుకు బీసీసీఐ ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఎనిమిది మంది సభ్యుల కమిటీకి బోర్డు ప్రెసిడెంట్‌‌‌‌ రోజర్‌‌‌‌ బిన్నీ చైర్‌‌‌‌ పర్సన్‌‌‌‌గా, సెక్రటరీ జై షా కన్వీనర్‌‌‌‌గా వ్యవహరించనున్నారు. అరుణ్‌‌‌‌ ధుమాల్‌‌‌‌, రాజీవ్‌‌‌‌ శుక్లా, ఆశీష్‌‌‌‌ షెలార్‌‌‌‌, దేవజిత్‌‌‌‌ సైకియా, మధుమలి లేలే, ప్రభుతేజ్‌‌‌‌ భాటియా ఇందులో సభ్యులుగా ఉన్నారు. డబ్ల్యూపీఎల్‌‌‌‌ను మరింత రసవత్తరంగా మార్చేందుకు అవసరమైన చర్యలను ఈ కమిటీ తీసుకోనుంది. ఇందుకోసం డబ్ల్యూపీఎల్‌‌‌‌ ఫ్రాంచైజీలు, బ్రాడ్‌‌‌‌కాస్టర్స్‌‌‌‌, క్రికెట్‌‌‌‌ ఫ్యాన్స్‌‌‌‌తో వీళ్లు సమావేశం కానున్నారు.

ALSO READ:యష్ కొత్త సినిమా టాక్సిక్.. అదిరిపోయిన టైటిల్ వీడియో

వచ్చే ఏడాది జరిగే డబ్ల్యూపీఎల్‌‌‌‌కు సంబంధించిన ఆక్షన్‌‌‌‌ ఈ నెల 9న ముంబైలో జరగనుంది. మ్యాచ్‌‌‌‌ తేదీలను, వేదికలను త్వరలోనే ప్రకటించనున్నారు.