గురువారం(జనవరి 11) నుంచి భారత్ - అఫ్ఘనిస్తాన్ మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఇరు జట్లు ప్రాక్టీస్‌లో తలమునకలై ఉండగా.. మరో 24 గంటల్లో సిరీస్ ప్రారంభంకానుంది. మొహాలీ వేదికగా ఈ ఇరు జట్ల మధ్య తొలి టీ20 జరగనుంది. ఈ క్రమంలో ప్రీ-మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న భారత కోచ్ రాహుల్ ద్రవిడ్.. తుది జట్టు గురుంచి కీలక విషయాలు వెల్లడించారు.
వ్యక్తిగత కారణాల రీత్యా భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తొలి మ్యాచ్‌కు అందుబాటులో లేరని తెలిపిన ద్రావిడ్.. మిగిలిన రెండు మ్యాచ్‌లకు అతను అందుబాటులో ఉన్నారని చెప్పుకొచ్చారు. గాయం కారణంగా రుతురాజ్ గైక్వాడ్ దూరమవ్వగా.. దాదాపు 14 నెలల తరువాత టీ20 జట్టులోకి వచ్చిన రోహిత్ శర్మ తిరిగి ఓపెనర్‌గా దిగే అవకాశం ఉంది. లెఫ్ట్ - రైట్ కాంబినేషన్‌లో మరో ఓపెనర్‌గా యశస్వి జైస్వాల్ కంఫర్మ్ కాగా, రోహిత్ - గిల్‌లో ఎవరిని ఆడించాలనే దానిపై బీసీసీఐ డైలమాలో ఉంది. ఒకవేళ రోహిత్ వైపే ముగ్గుచూపితే.. గిల్‌కు తుది జట్టులో చోటుదక్కడం అనుమానమే.
కోహ్లీ స్థానంలో తిలక్ వర్మ
కోహ్లీ దూరమవ్వడంతో అతని స్థానంలో హైదరాబాదీ ఆటగాడు తిలక్ వర్మకు తుది జట్టులో చోటు దక్కనుంది. మూడో స్థానంలో అతన్నే ఆడించొచ్చు. ఇక నాలుగో స్థానంలో కీపర్ కమ్ బ్యాటర్ సంజూ శాంసన్, ఐదో స్థానంలో శివమ్ దూబే, ఆరో స్థానంలో రింకూ సింగ్‌లను కొనసాగించే అవకాశం ఉంది. ఇక బౌలర్ల విషయానికొస్తే అర్ష్‌దీప్ సింగ్, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్ పేసర్లు కాగా.. స్పినర్లలో ఎవరికి చోటు దక్కుతుందనేది ఆసక్తిగా మారింది. వాషింగ్టన్ సుందర్ లేదా అక్సర్ పటేల్, రవి బిష్ణోయ్ లేదా కుల్‌దీప్ యాదవ్ లలో ఇద్దరికి తుది జట్టులో చోటు దక్కనుంది.
భారత జట్టు(అంచనా): రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, రింకు సింగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్.
ఆఫ్ఘనిస్థాన్ సిరీస్ కోసం భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, తిలక్ వర్మ, రింకు సింగ్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్.