T20 World Cup 2024: పంత్‌కు చోటు.. టీ20 ప్రపంచకప్‌కు ఇర్ఫాన్ పఠాన్ జట్టు ఇదే

ఐపీఎల్ టోర్నీ ముగిసిన ఐదు రోజులకే(జూన్ 1 నుంచి) టీ20 ప్రపంచకప్‌ ప్రారంభం కానుంది. ఈ ఏడాది అమెరికా, వెస్టిండీస్ దేశాలు సంయుక్తంగా ఈ టోర్నీకి ఆతిథ్యమిస్తున్నాయి. గతేడాది వన్డే ప్రపంచ కప్ ను తృటిలో చేజార్చుకున్న టీమిండియా.. ఈసారి టైటిల్  గెలవడమే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. ఈ క్రమంలో పొట్టి ప్రపంచ కప్ కు ఎవరిని ఎంపిక చేయాలనేది బీసీసీఐ సెలెక్టర్ల ముందున్న అతి పెద్ద సవాల్. సీనియర్లకు చోటివ్వాలా..! లేదా యువ జట్టును పంపాలా..! అని తర్జన భర్జన పడుతున్నారు. 

ఒకవైపు, ఈ తర్జన భర్జనలు సాగుతుండగానే, మరోవైపు భారత మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ఏకంగా జట్టును ఎంపిక చేసి అందరిని ఆశ్చర్యపరిచారు. భారత బ్యాటింగ్ కు వెన్నుముకలా నిలిచే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను పఠాన్ కొనసాగించాడు. ఒక పెద్ద టోర్నమెంట్‌లో కోహ్లీ చాలా కీలకమని పఠాన్ నొక్కిచెప్పాడు. అలాగే, అతని స్ట్రైక్ రేట్ గురించి కొన్ని అపోహలను తొలగించాడు. జట్టు కష్టాల్లో పడితే, కోహ్లీ తప్ప మరొకరు రక్షించలేరని తెలిపాడు. అందుకు గత టీ20 ప్రపంచ కప్ టోర్నీలో పాక్ పై విరాట్ ఆడిన ఇన్నింగ్స్ ను గుర్తుచేశాడు.

పంత్ రీఎంట్రీ

వికెట్‌కీపర్‌గా ఎవరిని ఎంపిక చేయాలనేది భారత జట్టులో అతిపెద్ద సమస్య. ఐపీఎల్ లో సత్తా చాటుతున్న పంత్ కు, తిరిగి జట్టులో చోటిచ్చాడు. అయితే, అతనికి జితేష్ శర్మ నుంచి తీవ్రమైన పోటీ ఎదుర్కోక తప్పదని హెచ్చరించాడు.  

మొహ్సిన్ ఖాన్ 

ప్రపంచ కప్ గెలవాలనే ఆకాంక్ష ఉన్న ఏ జట్టుకైనా తప్పనిసరిగా "గన్ లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్" ఉండాలన్న ఇర్ఫాన్, అన్ క్యాప్డ్ ప్లేయర్,  లక్నో సూపర్ జెయింట్స్ పేసర్ మొహ్సిన్ ఖాన్ ను ఎంపికచేశాడు.

టీ20 ప్రపంచకప్‌ జట్టు(ఇర్ఫాన్ పఠాన్ ఎంపిక): యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ, శుభమాన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, జితేష్ శర్మ, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, మొహ్సిన్ ఖాన్, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్.

ALSO READ :- బాబర్ అజాం vs షహీన్ అఫ్రీది.. పాక్ క్రికెట్ బోర్డు అత్యవసర సమావేశం