![దశరథ్ మార్క్ ప్రేమకథ](https://static.v6velugu.com/uploads/2023/06/Rohit-Behal-and-Aparna-Janardhanan-in-Love-U-Ram-directed-by-DY-Chaudhary_RyShYWi83U.jpg)
రోహిత్ బెహల్, అపర్ణ జనార్దనన్ జంటగా డివై చౌదరి తెరకెక్కించిన చిత్రం ‘లవ్ యు రామ్’. దర్శకుడు కె.దశరథ్ నిర్మాతగా వ్యవహరిస్తూ కథను అందించారు. ఈనెల 30న సినిమా విడుదలవుతున్న సందర్భంగా డివై చౌదరి మాట్లాడుతూ ‘నేను , దశరథ్ చిన్నప్పటి స్నేహితులం. అతను సినిమాలు చేస్తుంటే.. నేను టీవీ సీరియల్స్ చేశాను. ఇద్దరం కలిసి ఓ క్లీన్ ఎంటర్‌టైనర్ చేయాలని ఇది స్టార్ట్ చేశాం. నిజానికి దీన్ని దశరథ్ డైరెక్ట్ చేయాలి. కానీ తను వేరే ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉండడంతో నన్ను డైరెక్ట్ చేయమన్నాడు.
ప్రేమించడమే జీవితం అని నమ్మే అమ్మాయి, నమ్మించడమే జీవితం అనుకునే అబ్బాయి మధ్య జరిగే ప్రేమకథ ఇది. అబ్బాయిలోని గుడ్ క్వాలిటీస్ చూసి ఇష్టపడ్డ అమ్మాయి.. అతనేంటో పూర్తిగా తెలుసుకున్నాక ఆ ప్రేమ ప్రయాణం ఎలా కొనసాగింది అనేది అందంగా చూపించాం. దశరధ్ మార్క్‌తో సాగే డిఫరెంట్ లవ్ స్టోరీ ఇది. ఇప్పటివరకూ చూసిన ప్రేమ కథలకు భిన్నంగా ఉంటుంది. యూత్ , ఫ్యామిలీ ఆడియెన్స్, ఎన్ఆర్ఐలకు బాగా రీచ్ అవుతుంది. దశరథ్ కాంబోలో మూడు వెబ్ సిరీస్‌లు రెడీ అవుతున్నాయి’ అన్నారు.