Rohit Sharma: సచిన్‌, గంగూలీలను దాటేశాడు.. 11వేల క్లబ్‌లో రో‘హిట్‌’

Rohit Sharma: సచిన్‌, గంగూలీలను దాటేశాడు.. 11వేల క్లబ్‌లో రో‘హిట్‌’

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అరుదైన ఘనత సాధించాడు. వన్డేల్లో 11వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా బంగ్లాదేశ్‌తో  జరిగిన మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ ఈ ఘనత సాధించాడు. కోహ్లీ తరువాత వన్డేల్లో వేగంగా 11వేల పరుగుల మార్క్ చేరుకున్న రెండవ ఆటగాడిగా రోహిత్ రికార్డుల్లోకెక్కాడు.

ఈ జాబితాలో రన్ మెషిన్ విరాట్‌ కోహ్లీ అగ్రస్థానంలో ఉన్నాడు. విరాట్‌ 222 ఇన్నింగ్స్‌లలో ఈ ఘనత సాధించాడు. రోహిత్‌ 261 వన్డేల్లో 11వేల మైలురాయిని చేరుకోగా.. సచిన్ 276 ఇన్నింగ్స్‌లలో 11వేల క్లబ్‌లో ఎంటరయ్యారు.

సచిన్, విరాట్, గంగూలీ తర్వాత వన్డే ఫార్మాట్‌లో 11,వేల పరుగులు పూర్తి చేసిన నాలగవ భారతీయుడు.. రోహిత్. 

వన్డేల్లో అత్యంత వేగంగా 11,000 పరుగులు

  • 1. విరాట్ కోహ్లీ: 222 ఇన్నింగ్స్‌లు
  • 2. రోహిత్ శర్మ: 261 ఇన్నింగ్స్‌లు
  • 3. సచిన్ టెండూల్కర్: 276 ఇన్నింగ్స్‌లు
  • 4. రికీ పాంటింగ్: 286 ఇన్నింగ్స్‌లు
  • 5. సౌరవ్ గంగూలీ: 288 ఇన్నింగ్స్‌లు