
న్యూఢిల్లీ: ఇండియా, పాకిస్తాన్ టెస్ట్ మ్యాచ్‌లపై కెప్టెన్ రోహిత్ శర్మ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. తటస్థ వేదికల్లో ఇరుజట్ల మధ్య టెస్ట్‌లు ఆడేందుకు తనకు ఎలాంటి ఇబ్బంది లేదన్నాడు. అద్భుతమైన బౌలింగ్ లైనప్ కలిగిన పాక్‌ను ఎదుర్కోవడం చాలా గొప్పగా ఉంటుందన్నాడు. ‘పాకిస్తాన్ మంచి జట్టు. అద్భుతమైన బౌలింగ్ లైనప్ వాళ్ల సొంతం. ఆ టీమ్‌తో ఆడితే మంచి పోటీ కూడా ఉంటుంది. కాకపోతే విదేశాల్లో ఈ మ్యాచ్‌లు జరగాలని అనుకుంటున్నా. పాక్‌తో ఆడటానికి ఇష్టపడతాను. రెండు జట్ల మధ్య పోరాటం ఓ రేంజ్‌లో ఉంటుంది. ఇది ఫ్యాన్స్‌కు కూడా బాగా నచ్చుతుంది’ అని రోహిత్ పేర్కొన్నాడు.