ముకేశ్‌‌‌‌పై రోహిత్‌‌‌‌ ఫోకస్‌‌

  • శార్దూల్‌‌‌‌కు గాయం!

సెంచూరియన్‌‌‌‌: సౌతాఫ్రికాతో రెండో టెస్ట్‌‌‌‌ కోసం టీమిండియా నెట్స్‌‌‌‌లో తీవ్రంగా చెమటోడ్చింది. ఆప్షనల్‌‌‌‌ ప్రాక్టీసే అయినా కెప్టెన్‌‌‌‌ రోహిత్‌‌‌‌తో పాటు ముకేశ్‌‌‌‌ కుమార్‌‌‌‌, జడేజా, అశ్విన్‌‌‌‌ శనివారం రెండు గంటల పాటు ప్రాక్టీస్‌‌‌‌ చేశారు. ముఖ్యంగా ముకేశ్‌‌‌‌ కుమార్‌‌‌‌ బౌలింగ్‌‌‌‌పై రోహిత్ ఎక్కువగా ఫోకస్‌‌‌‌ పెట్టాడు. 45 నిమిషాల పాటు అతని బౌలింగ్‌‌‌‌లో నాన్‌‌‌‌ స్టాప్‌‌‌‌గా బ్యాటింగ్ చేశాడు. 

లైన్‌‌‌‌ అండ్‌‌‌‌ లెంగ్త్‌‌‌‌ను మారుస్తూ బాల్స్‌‌‌‌ వేయించుకుని మరీ ప్రాక్టీస్‌‌‌‌ చేశాడు. గాయం నుంచి కోలుకున్న రవీంద్ర జడేజా ఫుల్‌‌‌‌ ఫిట్‌‌‌‌నెస్‌‌‌‌తో కనిపించాడు. అశ్విన్‌‌‌‌తో కలిసి ఒకే నెట్‌‌‌‌లో బ్యాటింగ్‌‌‌‌ సరి చూసుకున్నాడు. త్రో డౌన్స్‌‌‌‌ స్పెషలిస్ట్‌‌‌‌ దయానంద్‌‌‌‌ గరానీ ఆఫ్‌‌‌‌ స్టంప్‌‌‌‌ లక్ష్యంగా వేసిన బాల్స్‌‌‌‌ను ఈ ఇద్దరు ప్రాక్టీస్‌‌‌‌ చేశారు. బౌలింగ్‌‌‌‌ కోచ్‌‌‌‌ పారస్‌‌‌‌ మాంబ్రే నిర్దేశించిన లెంగ్త్‌‌‌‌లో పేసర్‌‌‌‌ ప్రసిధ్‌‌‌‌ కృష్ణ  బౌలింగ్‌‌‌‌ వేశాడు. 

షార్ట్‌‌‌‌, బ్యాక్‌‌‌‌ లెంగ్త్‌‌‌‌ బాల్స్‌‌‌‌ను ప్రాక్టీస్‌‌‌‌ చేశాడు. ఇక నెట్స్‌‌‌‌లో బ్యాటింగ్‌‌‌‌ చేసే క్రమంలో సీమ్‌‌‌‌ ఆల్‌‌‌‌రౌండర్‌‌‌‌ శార్దూల్‌‌‌‌ ఠాకూర్‌‌‌‌ భుజానికి గాయమైంది. నొప్పితో బాధపడిన ఠాకూర్‌‌‌‌ బౌలింగ్‌‌‌‌ చేయకుండానే వెళ్లిపోయాడు. అయితే స్కానింగ్‌‌‌‌ తర్వాత గాయం తీవ్రత గురించి స్పష్టత రానుంది.