IND vs AUS: రెండో టెస్టుకు రోహిత్, గిల్ సిద్ధం.. అడిలైడ్ టెస్టుకు ఆ ఇద్దరిపై వేటు

IND vs AUS: రెండో టెస్టుకు రోహిత్, గిల్ సిద్ధం.. అడిలైడ్ టెస్టుకు ఆ ఇద్దరిపై వేటు

భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో టెస్ట్ అడిలైడ్ వేదికగా డిసెంబర్ 6 నుంచి జరగనుంది. తొలి టెస్టుకు దూరమైన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, యువ ఆటగాడు శుభమాన్ గిల్  రెండో టెస్టుకు అందుబాటులో ఉండడం దాదాపుగా ఖాయమైంది. ఈ మ్యాచ్ కు ముందు టీమిండియా టీమిండియా ప్రైమ్ మినిస్టర్ ఎలెవన్‌తో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది.నవంబర్ 30, డిసెంబర్ 1న జరగబోయే ఈ మ్యాచ్ కు కాన్ బెర్రాలోని మనుకా ఓవల్‌ ఆతిధ్యమివ్వనుంది. ఈ మ్యాచ్ లో భారత్ ఫుల్ స్క్వాడ్ తో ఆడనుంది.

ALSO READ | Eng vs NZ: ఫిలిప్స్‌కే ఇలాంటివి సాధ్యం: సూపర్ మ్యాన్ తరహాలో స్టన్నింగ్ క్యాచ్

పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో రోహిత్ శర్మ వ్యక్తిగత కారణాల వలన వైదొలిగాడు. అతని భార్య కుమారుడికి జన్మనివ్వడంతో రోహిత్ తొలి టెస్టుకు దూరంగా ఉండాల్సి వచ్చింది. అయితే పెర్త్ టెస్ట్ జరుగుతున్నప్పుడే రోహిత్ భారత జట్టులో చేరాడు. ఓ వైపు మ్యాచ్ జరుగుతుంటే మరోవైపు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తూ తాను సిద్ధంగా ఉన్నానని చెప్పకనే చెప్పాడు. మరోవైపు చేతి వేలి గాయం నుంచు గిల్ కోలుకున్నట్టు తెలుస్తుంది. ఇటీవలే అతని చేతికి ఎలాంటి బ్యాండేజ్ లేదు. నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. 

రోహిత్, గిల్ జట్టులోకి చేరడంతో వారు ప్లేయింగ్ 11 లో ఆడడం ఖాయం. రోహిత్ కెప్టెన్ కాగా.. గిల్ మూడో స్థానంలో కీలక ప్లేయర్. వీరిద్దరూ జట్టులోకి రావడంతో తుది జట్టు నుంచి పడికల్, వికెట్ కీపర్ బ్యాటర్ ధృవ్ జురెల్ బెంచ్ కి పరిమితం కానున్నారు. తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్ లో పడికల్ విఫలమయ్యాడు. జురెల్ సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యాడు. దీంతో వీరి స్థానాల్లో రోహిత్, గిల్ రావడం ఖాయం.