న్యూఢిల్లీ: సౌతాఫ్రికా టూర్‌కు ఇండియా టీమ్స్‌ను ప్రకటించారు. గురువారం సమావేశమైన సెలెక్షన్ కమిటీ మూడు ఫార్మాట్లకు ముగ్గురు కెప్టెన్లను ఎంపిక చేసింది. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా గైర్హాజరీతో ఈ నిర్ణయం తీసుకుంది. సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ విజ్ఞప్తి మేరకు వైట్ బాల్ సిరీస్‌లకు వీళ్లను సెలెక్ట్ చేయలేదు. గతేడాది జరిగిన టీ20 వరల్డ్ కప్ నుంచి ఈ ఇద్దరు షార్ట్ ఫార్మాట్ ఆడటం లేదు.
.అయితే వచ్చే ఏడాది మెగా ఈవెంట్ ఉండటంతో వీళ్లను మళ్లీ బరిలోకి దించుతారని ఊహాగానాలు వచ్చాయి. కానీ ఇద్దరూ విశ్రాంతి తీసుకోవడానికే మొగ్గు చూపారు. ఇక మెడికల్ ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న మహ్మద్ షమీ ఫిట్‌నెస్‌తో ఉంటే టెస్ట్‌ల్లో ఆడతాడు. లేదంటే అప్పటి పరిస్థితులను బట్టి ప్రత్యామ్నాయ ప్లేయర్‌ను ప్రకటిస్తారు. డిసెంబర్ 10, 12, 14న మూడు టీ20లు... 17, 19, 21న మూడు వన్డేలు జరగనున్నాయి. డిసెంబర్ 26 నుంచి 30 వరకు, జనవరి 3 నుంచి 7 వరకు రెండు టెస్ట్‌లు జరుగుతాయి.
టెస్ట్ జట్టు: రోహిత్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్, రుతురాజ్, ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్, అశ్విన్, జడేజా, శార్దూల్ ఠాకూర్, సిరాజ్, ముకేశ్ కుమార్, షమీ*, బుమ్రా, ప్రిసిధ్ కృష్ణ.
వన్డే టీమ్: కేఎల్ రాహుల్ (కెప్టెన్), రుతురాజ్, సాయి సుదర్శన్, తిలక్ వర్మ, రజత్ పటీదార్, రింకూ సింగ్, శ్రేయస్ అయ్యర్, సంజూ శాంసన్, అక్షర్ పటేల్, సుందర్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చహల్, ముకేశ్ కుమార్, అవేశ్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్, దీపక్ చహర్.
టీ20 జట్టు: సూర్య కుమార్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, రుతురాజ్, తిలక్ వర్మ, రింకూ సింగ్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్, జితేష్ శర్మ, జడేజా, సుందర్, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, సిరాజ్, ముకేశ్ కుమార్, దీపక్ చహర్.