IND vs NZ 2nd Test: జట్టుగా ఓడిపోయాం.. ఆ విషయం గురించి ఆలోచన లేదు: రోహిత్ శర్మ

IND vs NZ 2nd Test: జట్టుగా ఓడిపోయాం.. ఆ విషయం గురించి ఆలోచన లేదు: రోహిత్ శర్మ

స్వదేశంలో 12 ఏళ్లుగా ప్రత్యర్థిని వణికిస్తూ ఒక్క సిరీస్ ఓడిపోకుండా విజయాలు సాధిస్తూ వచ్చిన టీమిండియాకు న్యూజిలాండ్ దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. మరో టెస్ట్ మ్యాచ్య్ మిగిలి ఉండగానే భారత్ పై 2-0 తేడాతో సిరీస్ ను సొంతం చేసుకుంది. బెంగళూరు వేదికగా జరిగిన తొలి టెస్టులో గెలిచి భారత్ కు షాక్ ఇచ్చిన న్యూజిలాండ్.. పూణే టెస్టులోనూ భారీ విజయాన్ని సొంతం చేసుకొని మ్యాచ్ తో పాటు సిరీస్ కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్ తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ లో రోహిత్ ఓటమిపై స్పందించాడు. 

"మ్యాచ్ ఓడిపోవడం చాలా బాధగా ఉంది. మ్యాచ్ తో పాటు మేము సిరీస్ కూడా ఓడిపోయాం. జట్టుగా మేము సరిగా ఆడలేదు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ గురించి  లోచించడం లేదు. ఇది సమిష్టి వైఫల్యం". అని ప్రెస్ మీట్ లో రోహిత్ తెలిపాడు. భారత్ న్యూజిలాండ్ పై సిరీస్ ఓడిపోవడంతో టెస్ట్ ఛాంపియన్ షిప్ పాయింట్స్ టేబుల్ లో తీవ్ర ప్రభావం చూపనుంది. మిగిలిన ఆరు టెస్టుల్లో నాలుగు టెస్టులు గెలిస్తే నేరుగా ఫైనల్ కు అర్హత సాధిస్తుంది. లేకపోతే ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. 

ALSO READ | IND vs NZ 2nd Test: 12 ఏళ్ళ తర్వాత టెస్ట్ సిరీస్ ఓటమి.. భారత ఓటమికి కారణాలివే

ఈ మ్యాచ్ విషయానికి వస్తే కివీస్ నిర్ధేశించిన 359 పరుగుల భారీ ఛేదనలో టీమిండియా 245 పరుగుల వద్ద ఆలౌట్ అయ్యింది. రోహిత్ శర్మ (8), శుభ్ మన్ గిల్(23), రిషబ్ పంత్ (0), విరాట్ కోహ్లీ(17), సర్ఫరాజ్ ఖాన్(9), వాషింగ్టన్ సుందర్(21).. ఇలా ఏ ఒక్కరూ జట్టును ఆదుకునే ప్రయత్నం చేయలేదు. దాంతో, టీమిండియాకు ఓటమి తప్పలేదు.  కాగా, తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్‌ 259 పరుగులు చేయగా.. భారత్ 155 పరుగులకు ఆలౌటైంది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో కివీస్ జట్టు 255 పరుగులు చేసింది.