T20 World Cup 2024: ఆ ముగ్గురి సహకారం వల్లే టీ20 వరల్డ్ కప్ గెలిచాం: రోహిత్ శర్మ

దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన తొలి టీ20 వరల్డ్ కప్ ను ధోనీ కెప్టెన్సీలో భారత్ గెలుచుకుంది. 17 ఏళ్ళ తర్వాత మళ్ళీ రోహిత్ సారధ్యంలో భారత్ టీ20 వరల్డ్ కప్ గెలిచి విశ్వ విజేతగా అవతరించింది. దీంతో 11 సుదీర్ఘ విరామం తర్వాత భారత్ ఐసీసీ టైటిల్ గెలుచుకుంది  శనివారం (జూన్ 29) బార్బడోస్ వేదికగా దక్షిణాఫ్రికాపై జరిగిన ఫైనల్లో 7 పరుగుల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. 11 ఏళ్ళ తర్వాత ఐసీసీ ట్రోఫీ.. 17 ఏళ్ళ తర్వాత టీ20 వరల్డ్ కప్ గెలవడంతో దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని అంటాయి. 

ఈ మధుర జ్ఞాపకాలను రోహిత్ శర్మ మరోసారి గుర్తు చేసుకున్నాడు. భారత్ టైటిల్ గెలవడం వెనుక ముగ్గురు కీలక పాత్ర పోషించారని రోహిత్ అన్నాడు. ఒక అవార్డు ఫంక్షన్ లో మాట్లాడుతూ.. బీసీసీఐ సెక్రటరీ జయ్ షా, ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్, సెలెక్టర్ల చైర్మన్ అజిత్ అగార్కర్ ఇచ్చిన సపోర్ట్ వల్లే ఈ విజయం సాధ్యమైందని హిట్ మ్యాన్ తెలిపాడు. ఈ ముగ్గురు ప్రపంచ కప్ విజయానికి పిల్లర్లు అని..   ఆటగాళ్లకు మంచి స్వేచ్ఛ ఇవ్వడంలో సహకరించారని ఈ త్రయంపై ప్రశంసల వర్షం కురిపించాడు. 

ఈ ఫైనల్ మ్యాచ్ విషయానికి వస్తే టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా 20 ఓవర్లలో 176/7 స్కోరు చేసింది. విరాట్ కోహ్లీ (76) బ్యాట్‌‌తో  మెరిపించగా.. బౌలింగ్‌‌లో హార్దిక్ పాండ్యా (3/20), జస్‌‌ప్రీత్ బుమ్రా (2/18), అర్ష్​దీప్ సింగ్ (2/20) సత్తా చాటారు. ఛేజింగ్‌‌లో సౌతాఫ్రికా 169/8 స్కోరు మాత్రమే చేసి ఓడిపోయింది. క్లాసెన్‌‌‌‌‌‌‌‌ (27 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 2 ఫోర్లు, 5 సిక్స్‌‌‌‌‌‌‌‌లతో 52) టాప్‌‌‌‌‌‌‌‌ స్కోరర్‌‌‌‌‌‌‌‌. డికాక్‌‌‌‌‌‌‌‌ (39) రాణించాడు. కోహ్లీకి ‘ప్లేయర్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌‌‌‌‌’, బుమ్రాకు ‘ప్లేయర్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ ద టోర్నీ’ అవార్డులు లభించాయి.