టీమిండియాకు బ్యాడ్ న్యూస్ ...రోహిత్, ఆకాశ్‌‌‌‌‌‌‌‌కు గాయాలు

టీమిండియాకు బ్యాడ్ న్యూస్ ...రోహిత్, ఆకాశ్‌‌‌‌‌‌‌‌కు గాయాలు

మెల్‌‌‌‌‌‌‌‌బోర్న్‌‌‌‌‌‌‌‌: ఇండియా కెప్టెన్‌‌‌‌‌‌‌‌ రోహిత్‌‌‌‌‌‌‌‌ శర్మ, పేసర్‌‌‌‌‌‌‌‌ ఆకాశ్‌‌‌‌‌‌‌‌ దీప్‌‌‌‌‌‌‌‌ నెట్స్‌‌‌‌‌‌‌‌లో గాయపడ్డారు. మెల్‌‌‌‌‌‌‌‌బోర్న్‌‌‌‌‌‌‌‌ క్రికెట్‌‌‌‌‌‌‌‌ గ్రౌండ్‌‌‌‌‌‌‌‌ (ఎంసీజీ)లో త్రోడౌన్స్‌‌‌‌‌‌‌‌ను ఎదుర్కొంటున్న టైమ్‌‌‌‌‌‌‌‌లో రోహిత్‌‌‌‌‌‌‌‌ ఎడమ మోకాలికి దెబ్బ తగిలింది. అయినా కాసేపు బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌ను కొనసాగించిన హిట్‌‌‌‌‌‌‌‌మ్యాన్‌‌‌‌‌‌‌‌ తర్వాత ఫిజియోతో చికిత్స చేయించుకున్నాడు. కుర్చీపై కాలు చాచి మోకాలికి ఐస్‌‌‌‌‌‌‌‌ ప్యాక్‌‌‌‌‌‌‌‌ పెట్టుకున్నాడు. కాసేపు కూర్చున్న తర్వాత లేచి అటు ఇటు నడిచాడు. త్రోడౌన్స్‌‌‌‌‌‌‌‌ను ఆడే సమయంలోనే ఆకాశ్‌‌‌‌‌‌‌‌ చేతికి కూడా గాయమైంది. అయితే  ఇద్దరి గాయాలు పెద్దవి కాదని తెలుస్తోంది. 

 ‘క్రికెట్‌‌‌‌‌‌‌‌ ఆడుతున్నప్పుడు ఇలాంటి దెబ్బలు సర్వసాధారణం. ప్రాక్టీస్‌‌‌‌‌‌‌‌ పిచ్‌‌‌‌‌‌‌‌ వైట్‌‌‌‌‌‌‌‌బాల్ కోసం చేసిందనుకుంటున్నా. అందుకే బాల్‌‌‌‌‌‌‌‌ కొన్నిసార్లు తక్కువ బౌన్స్‌‌‌‌‌‌‌‌ అవుతోంది. ప్రాక్టీస్‌‌‌‌‌‌‌‌లో ఇవన్నీ మామూలే. వీటి గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’ అని ఆకాశ్‌‌‌‌‌‌‌‌ దీప్‌ మీడియాతో వ్యాఖ్యానించాడు. శనివారం నెట్స్‌‌‌‌‌‌‌‌లో ప్రాక్టీస్‌‌‌‌‌‌‌‌ చేస్తుండగా కేఎల్‌‌‌‌‌‌‌‌ రాహుల్‌‌‌‌‌‌‌‌ చేతికి కూడా దెబ్బ తగిలింది.