IND vs NZ 2024: తొలి టెస్టుకు రోహిత్, విలియంసన్ దూరం..? కారణమిదే..!

IND vs NZ 2024: తొలి టెస్టుకు రోహిత్, విలియంసన్ దూరం..? కారణమిదే..!

న్యూజిలాండ్, భారత్ జట్ల మధ్య అక్టోబర్ 16 నుంచి మూడు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం తొలి టెస్ట్ కు ఆతిధ్యమిస్తుంది.వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (2023-25) లో భాగంగా ఇరు జట్లకు ఇది కీలక సిరీస్. ఈ సిరీస్ లో కోల్పోతే కివీస్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ నుంచి నిష్క్రమిస్తుంది. మరోవైపు భారత్ ఈ సిరీస్ ఓడితే ఆస్ట్రేలియాపై బోర్డర్గవాస్కర్ ట్రోఫీ ఖచ్చితంగా గెలవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇరు జట్లకు బిగ్ షాక్ తగలనుంది. 

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రోహిత్ శర్మ రెండోసారి తండ్రి కాబోతున్నాడు. అతని భార్య రితికా సజ్దే త్వరలో రెండో బిడ్డకు జన్మనివ్వబోతోంది. దీంతో వ్యక్తిగత కారణాల వలన రోహిత్ తొలి టెస్టుకు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కివీస్ తో టెస్ట్ సిరీస్ కు భారత టెస్ట్ జట్టును ఇంకా ప్రకటించలేదు. రెండు రోజుల్లో స్క్వాడ్ ను ప్రకటించే అవకాశం ఉంది. రోహిత్ శర్మ దూరమైతే అతని స్థానంలో అభిమన్యు ఈశ్వరన్ లేకపోతే ఋతురాజ్ గైక్వాడ్ జైస్వాల్ తో ఇన్నింగ్స్ ఆరంభించవచ్చు. అదే సమయంలో రోహిత్ స్థానంలో భారత కెప్టెన్ ఎవరనే విషయంలో ఆసక్తి నెలకొంది. 

రోహిత్ శర్మ, రితికలు జూన్ 3, 2015న నిశ్చితార్థం చేసుకున్నారు. 2015 డిసెంబర్ 13 న వీరి వివాహం ముంబైలోని తాజ్ ల్యాండ్స్ హోటల్‌లో గ్రాండ్ గా వారి వివాహం జరిగింది. ఈ దంపతులకు 2018 డిసెంబర్ 30 న కూతురు పుట్టింది. ఈ చిన్నారికి వారు సమైరా అనే పేరు పెట్టారు. మళ్ళీ ఆరేళ్ళ తర్వాత రోహిత్ శర్మ మరోసారి తండ్రి కాబోతున్నాడు. 

Also Read :- ఇంగ్లాండ్ ఆల్‌టైం బెస్ట్ బ్యాటర్‌గా రూట్

మరోవైపు న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ కేన్ విలియంసన్ తొలి టెస్టుకు దూరం అయ్యాడు. గజ్జల్లో గాయం కారణంగా అతడు తొలి టెస్ట్ ఆడట్లేదు. బ్యాకప్ గా కేన్ స్థానంలో మార్క్ చాప్‌మన్‌ను స్క్వాడ్‌లో చేర్చారు. భారత్ తో జరగబోయే మూడు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ కు న్యూజిలాండ్ క్రికెట్ తమ జట్టును ప్రకటించింది. ఈ సిరీస్‌కు టామ్ లాథమ్ తొలిసారిగా పూర్తిస్థాయి టెస్టు కెప్టెన్‌గా జట్టును నడిపించనున్నాడు.