Rohit Sharma: 5 కాదు..10 కాదు ఏకంగా 17: షాకిస్తున్న రోహిత్ ఐసీసీ ట్రోఫీ రికార్డ్

Rohit Sharma: 5 కాదు..10 కాదు ఏకంగా 17: షాకిస్తున్న రోహిత్ ఐసీసీ ట్రోఫీ రికార్డ్

టీమిండియా వన్డే, టెస్ట్ కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డ్ ఒకటి ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఎవరికీ తెలియని ఐసీసీ రికార్డ్ హిట్ మ్యాన్ ఖాతాలో ఉండడం విశేషం. అదేంటో కాదు ఇప్పటివరకు రోహిత్ ఏకంగా 17 ఐసీసీ ట్రోఫీలు ఆడడం విశేషం. ఈ విషయం తాజాగా వెలుగులోకి రావడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రస్తుతం టీమిండియా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం సిద్ధమవుతుంది. ఇందులో భాగంగా ఆటగాళ్ళు దుబాయ్‌లో అధికారిక ఫోటోషూట్‌లో పాల్గొన్నారు. స్టూడియోకి వెళ్లే దారిలో, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా కారులో సరదాగా మాట్లాడుకున్నారు. 

ఈ సందర్భంగా ఐసీసీ ఈవెంట్లలో తమ సుదీర్ఘ ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు. కారులో జడేజా మాట్లాడుతూ.. రోహిత్ ను ఇది నీకు ఎన్నో ఐసీసీ టైటిల్ అని అడుగుతాడు. దానికి హిట్ మ్యాన్ ప్రస్తుతం జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీ నాకు 17వది అని చెబుతాడు. దీనికి జడేజా ఆశ్చర్యపోతూ నవ్వుకుంటాడు. తొలి సారి 2007 టీ20 వరల్డ్ కప్ తో తన ఐసీసీ జర్నీ స్టార్ట్ చేసిన రోహిత్ ఇప్పటివరకు జరిగిన 9 టీ20  వరల్డ్ కప్ టోర్నీలు ఆడాడు. 3 వన్డే ప్రపంచ కప్‌లతో పాటు.. రెండు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్లో రోహిత్ భారత్ కు ప్రాతినిధ్యం వహించాడు.

క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఛాంపియన్స్ ట్రోఫీకి రంగం సిద్ధమైంది. బుధవారం (ఫిబ్రవరి 19) గ్రాండ్ గా ఈ మెగా టోర్నీ ప్రారంభంకానుంది. తొలి మ్యాచ్‌లో ఆతిథ్య పాకిస్తాన్ న్యూజిలాండ్‌తో తలపడనుంది. కరాచీలోని నేషనల్ స్టేడియం ఈ మ్యాచ్ కు ఆతిధ్యం ఇస్తుంది. భారత్ మ్యాచ్ ల విషయానికి వస్తే బంగ్లాదేశ్ తో గురువారం (ఫిబ్రవరి 20) టోర్నీలో తొలి మ్యాచ్ ఆడనుంది. దుబాయ్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభం కానుంది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో ఫిబ్రవరి 23న.. న్యూజి లాండ్ తో మార్చి 2 న తలపడనుంది.