టీమిండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు కష్టకాలం నడుస్తుంది. ఇప్పటికే టీ20 ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన ఈ దిగ్గజ ఆటగాళ్లు టెస్ట్ క్రికెట్ లో ఘోరంగా విఫలమవుతున్నారు. ముఖ్యంగా ఇటీవలే ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో దారుణంగా నిరాశపరిచారు. రోహిత్ ఆడిన ఐదు ఇన్నింగ్స్ ల్లో సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యాడు. చెత్త ఫామ్ కారణంగా చివరి టెస్ట్ లో హిట్ మ్యాన్ కు చోటు దక్కలేదు. మరోవైపు కోహ్లీ ఒక సెంచరీ మినహా మిగిలిన ఇన్నింగ్స్ ల్లో విఫలమయ్యాడు. జూన్ వీరిద్దరినీ బీసీసీఐ దేశవాళీ క్రికెట్ ఆడాలని సూచిందంట.
రిపోర్ట్స్ ప్రకారం బీసీసీఐ రివ్యూ మీటింగ్ లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను రంజీ ట్రోఫీ మ్యాచ్‌లు ఆడాల్సిందిగా కోరిందట. బోర్డు సమావేశంలో ఆటగాళ్లందరూ వీలు చిక్కినప్పుడల్లా దేశవాళీ క్రికెట్ ఆడాలని ఆదేశించినట్టు సమాచారం. ప్రధాన కోచ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అగార్కర్ తో పాటు ఫిజియో అనుమతిస్తే మాత్రమే ఆటగాడు దేశవాళీ మ్యాచ్‌లకు దూరంగా ఉండొచ్చు. కానీ గంభీర్ ఇటీవలే ఆస్ట్రేలియా పర్యటన తర్వాత ఆటగాళ్లందరూ దేశవాళీ క్రికెట్ ఆడాలని సూచించాడు. దీంతో కోహ్లీ, రోహిత్ ను త్వరలో రంజీ ట్రోఫీలో చూసే అవకాశం ఉంది.
ALSO READ | Champions Trophy 2025: లిటన్ దాస్, షకీబ్‌కు నో ఛాన్స్.. ఛాంపియన్స్ ట్రోఫీకి బంగ్లాదేశ్ జట్టు ప్రకటన
2025 డబ్ల్యూటీసీ టెస్ట్ సిరీస్ ను భారత్ జూన్ నెల నుంచి ప్రారంభించనుంది. ఇందులో భాగంగా ఇంగ్లాండ్ గడ్దపై భారత్ 5 టెస్టులు ఆడనుంది. ఈ సిరీస్ రోహిత్, కోహ్లిలకు కీలకం కానుంది. ఈ సిరీస్ లో విఫలమైతే వీరి టెస్ట్ కెరీర్ దాదాపు ముగిసినట్టే. రోహిత్ శర్మ చివరిసారిగా 2016లో దేశవాళీ మ్యాచ్ ఆడగా, విరాట్ కోహ్లీ 2012 నుంచి దేశవాళీ క్రికెట్ కు దూరంగా ఉంటూ వస్తున్నాడు. 2024లో టెస్ట్ క్రికెట్‌లో కోహ్లీ, రోహిత్ సగటు 25 కంటే తక్కువగా ఉంది. జనవరి 23 నుంచి రంజీ ట్రోఫీ ప్రారంభం కానుంది. ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్, ఛాంపియన్స్ ట్రోఫీ ఉండడంతో రోహిత్, కోహ్లీ ఆడడం కష్టమే.