AUS vs IND: ప్రాక్టీస్‌లోనూ వదలట్లే: కోహ్లీ, రోహిత్‌ను చూడడానికి ఎగబడ్డ ప్రేక్షకులు

AUS vs IND: ప్రాక్టీస్‌లోనూ వదలట్లే: కోహ్లీ, రోహిత్‌ను చూడడానికి ఎగబడ్డ ప్రేక్షకులు

టీమిండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల బ్యాటింగ్ చూడడానికి గ్రౌండ్ లో అభిమానులు భారీగా తరలి వస్తారు. ప్రపంచవ్యాప్తంగా వీరిద్దరికీ ఉన్న క్రేజ్ అలాంటిది. వీరు ఏ దేశంలో ఆడినా అక్కడ ఫ్యాన్స్ వీరిని చూడడానికి రెడీగా ఉంటారు. అయితే తాజాగా అడిలైడ్ లో కోహ్లీ, రోహిత్ ఆస్ట్రేలియాలో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు అభిమానులు చాలా మంది రావడం విశేషం. దూరం నుంచి భారత ఆటగాళ్లను చూస్తూ వీరు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది. ఆడుతుంది ఆసీస్ లోనైనా అక్కడ మన వాళ్ళ హవా అని సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.  

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా టీమిండియా శుక్రవారం (డిసెంబర్ 6) నుంచి తొలి టెస్ట్ ఆడుతుంది. అడిలైడ్ వేదికగా ఈ టెస్ట్ జరగనుంది. ఈ సిరీస్ లో కెప్టెన్ రోహిత్ శర్మకు ఇదే తొలి టెస్ట్ మ్యాచ్. వ్యక్తిగత కారణాల వలన హిట్ మ్యాన్ తొలి టెస్టుకు అందుబాటులో లేకపోగా.. వైస్ కెప్టెన్ బుమ్రా కెప్టెన్ గా చేశాడు. ఇక కోహ్లీ పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో సెంచరీతో ఫామ్ లోకి వచ్చాడు. ఇదే ఫామ్ కొనసాగించాలని అభిమానులు కోరుకుంటున్నారు. తొలి టెస్టులో గెలిచిన భారత్.. ఈ మ్యాచ్ లోనూ గెలవాలనే పట్టుదలతో కనిపిస్తుంది.   

ALSO READ :IND vs AUS: చరిత్రకు చేరువలో: సచిన్ 14 ఏళ్ళ రికార్డ్ పై జైశ్వాల్ గురి

పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టు ఓటమి తర్వాత ఆస్ట్రేలియా ఒత్తిడిలో కనిపిస్తుంది. సిరీస్ చేజారకుండా ఉండాలంటే రెండో టెస్టులో ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు వెళ్లాలంటే ఈ మ్యాచ్ గెలుపు అత్యంత కీలకం. మరోవైపు తొలి టెస్టులో గెలిచిన తర్వాత టీమిండియా ఫుల్ జోష్ లో ఉంది. ఒకరకంగా చూసుకుంటే రెండో టెస్టుకు మరింత బలంగా కనిపిస్తుంది. తొలి టెస్టుకు దూరమైన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, యువ ఆటగాడు శుభమాన్ గిల్  రెండో టెస్టుకు అందుబాటులో ఉండడం  ఖాయమైంది.