
ఛాంపియన్స్ ట్రోఫీలో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ పై మరోసారి టీమిండియాదే పై చేయి సాధించింది. దుబాయ్ వేదికగా ఆదివారం(ఫిబ్రవరి 23) పాకిస్థాన్ తో జరిగిన గ్రూప్ మ్యాచ్ లో భారత్ 6 వికెట్ల తేడాతో పాకిస్థాన్ పై ఘన విజయం సాధించింది. ఈ విజయంతో భారత్ దాదాపు సెమీస్ బెర్త్ ను ఖాయం చేసుకుంది. మరోవైపు పాకిస్థాన్ టోర్నీ నుంచి నిష్క్రమించే ప్రమాదంలో పడింది. ఈ మ్యాచ్ లో కోహ్లీ సెంచరీ హైలెట్ గా నిలిచింది. అయితే కోహ్లీ సెంచరీ ముందు ఒక పెద్ద హై డ్రామానే నడిచింది.
42 ఓవర్లు ముగిసేసరికి భారత్ 4 వికెట్ల నష్టానికి 238 పరుగులు చేసింది. ఈ దశలో కోహ్లీ 95 పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తున్నాడు. మరోవైపు భారత్ విజయానికి 4 పరుగులే కావాలి. దీంతో కోహ్లీ సెంచరీ కొడతాడా లేదా అని సగటు అభిమానిలో హై టెన్షన్ మొదలయింది. తొలి బంతికే కోహ్లీ సిక్సర్ కొడతాడని అందరూ భావించారు. కానీ విరాట్ సింగిల్ తీశాడు. దీంతో కోహ్లీ సెంచరీపై మరింత ఉత్కంఠ నెలకొంది. ఆ తర్వాత బంతికి అక్షర్ పటేల్ కూడా కోహ్లీ సెంచరీని దృష్టిలో పెట్టుకొని సింగిల్ తీశాడు. దీంతో భారత్ రెండు పరుగులు చేయాలి. కోహ్లీ 96 పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తున్నాడు.
ఈ దశలో కోహ్లీ సెంచరీ చేయాలంటే ఖచ్చితంగా బౌండరీ కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ దశలో డ్రెస్సింగ్ రూమ్ నుంచి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సిక్సర్ కొట్టొచ్చుగా అని నవ్వుతూ చేతులు పైకి చూపించాడు. ఎంతో సరదాగా సాగిన ఈ సంఘటన, రోహిత్ రియాక్షన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఖుష్దిల్ షా వేసిన మూడో బంతికి కవర్స్ మీదుగా ఫోర్ బాది కోహ్లీ తన సెంచరీ మార్క్ అందుకున్నాడు. రోహిత్ చెప్పినట్టు సిక్సర్ కొట్టకపోయినా తన సెంచరీకి అవసరమైన ఫోర్ కొట్టి సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
ఈ బౌండరీతో కోహ్లీ సెంచరీతో పాటు భారత్ కూడా విజయం సాధించింది. దీంతో ఫ్యాన్స్ స్టేడియాన్ని హోరెత్తించారు. కోహ్లీ వన్డే కెరీర్ లో ఇది 51వ సెంచరీ కాగా.. ఓవరాల్ గా అంతర్జాతీయ క్రికెట్ లో 82 వది. ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. ఏకపక్ష పోరులో టాస్ నెగ్గిన పాకిస్తాన్ 49.4 ఓవర్లలో 241 రన్స్‌కు ఆలౌటైంది. సౌద్ షకీల్ (76 బాల్స్‌లో 5 ఫోర్లతో 62), మహ్మద్ రిజ్వాన్ (77 బాల్స్‌లో 3 ఫోర్లతో 46), ఖుష్దిల్ షా (39 బాల్స్‌లో 2 సిక్సర్లతో 38) రాణించారు.అనంతరం కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ (67 బాల్స్‌లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 56) మెరుపులతో ఇండియా 42.3 ఓవర్లలోనే 244/4 స్కోరు చేసి గెలిచింది.
"VIRAT SIX MAAR."
— Cricket Unplugged (@UnplugCricket) February 23, 2025
Rohit Sharma had a message for Virat Kohli when he was nearing his century with just a few runs needed to win. 🙌🏻#ViratKohli | #INDvsPAK | #ChampionsTrophy2025pic.twitter.com/HMMyFvmRMP