హైదరాబాద్, వెలుగు: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ మద్దతు గల లియో 1 యాప్ ఐదు లక్షల మంది వినియోగదారులను సొంతం చేసుకుంది. తమకు రోజురోజుకూ ప్రజాదరణ, విశ్వసనీయత పెరుగుతోందని కంపెనీ తెలిపింది.
లియో1 విద్యా సంస్థలకు ఆర్థిక సేవలు అందించే ఒక ప్లాట్‌ఫామ్. ఆర్థిక నిర్వహణ, ఫీజు చెల్లింపుల వంటి సేవలను అందిస్తుంది. లియో1ను గతంలో ఫైనాన్స్‌పీర్‌గా పిలిచేవారు. శర్మతోపాటు క్యూఈడీ ఇన్వెస్టర్లు, ఆవిష్కార్ క్యాపిటల్ ఇందులో ఇన్వెస్ట్ చేశారు. తమ ‘సాస్’ ప్లాట్‌ఫారమ్ ఫీజు వసూలు ప్రక్రియను ఆటోమేట్, డిజిటలైజ్ చేస్తుందని లియో 1 తెలిపింది.