భారత కెప్టెన్, ముంబై ఓపెనర్ రోహిత్ శర్మ ఐపీఎల్ టోర్నీలో మరో మైలురాయిను చేరుకున్నాడు. గురువారం(ఏప్రిల్ 18) పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్ ద్వారా 250 గేమ్‌లు పూర్తి చేసుకున్నాడు. తద్వారా ఐపీఎల్ చరిత్రలో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన రెండో ఆటగాడిగా తన పేరు లిఖించుకున్నాడు.
ఈ జాబితాలో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ సారథి ఎంఎస్ ధోని(256 మ్యాచ్‌లు) అగ్రస్థానంలో ఉన్నాడు. 249 మ్యాచ్‌లతో దినేష్ కార్తీక్ మూడో స్థానంలో ఉన్నాడు. వాస్తవానికి, హిట్ మ్యాన్ ఈ గేమ్‌కు ముందు డీకేని సమ చేశాడు. వీరిద్దరి తరువాత 244 మ్యాచ్‌లతో విరాట్ కోహ్లీ నాలుగో స్థానంలో ఉన్నాడు. ఐపిఎల్‌లో 200 గేమ్‌ల థ్రెషోల్డ్‌ను కేవలం 10 మంది మాత్రమే దాటారు. వారందరూ భారత ఆటగాళ్లే. ఐపీఎల్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఓవర్సీస్ ప్లేయర్‌గా కీరన్ పొలార్డ్(189 మ్యాచ్‌లు) అగ్రస్థానంలో ఉండగా.. దక్షిణాఫ్రికా స్టార్ బ్యాటర్ ఏబీ డివిలియర్స్(184 మ్యాచ్‌లు) రెండో స్థానంలో ఉన్నాడు.
Exactly 16 years after the first ever IPL game was played, Rohit Sharma joins MS Dhoni as the only two players to play 250 IPL games #IPL2024 | #PBKSvsMI pic.twitter.com/vPaI1c6gBf
— ESPNcricinfo (@ESPNcricinfo) April 18, 2024