వన్డే ప్రపంచకప్ 2023లో రోహిత్ శర్మ మరో రికార్డు సాధించాడు. వరల్డ్ కప్ చరిత్రలో అత్యంత వేగంగా 1000 పరుగులు చేసిన బ్యాటర్ గా రోహిత్ అవతరించాడు. రోహిత్ శర్మ 19 ఇన్నింగ్స్ ల్లో 1000 పరుగులు చేశాడు. దీంతో వరల్డ్ కప్ లో వేగంగా వెయ్యి పరుగులు చేసిన బ్యాటర్ గా డేవిడ్ వార్నర్ తో పాటు సమంగా నిలిచాడు. ఈ క్రమంలో మెగాటోర్నీలో 1000 పరుగులు దాటిన నాలుగో భారత బ్యాటర్‌గా రోహిత్ చరిత్రకెక్కాడు.
ALSO READ : IND vs AFG: సచిన్ రికార్డు బద్దలు కొట్టిన రోహిత్ శర్మ.. అంతర్జాతీయ క్రికెట్‌లో కొత్త రారాజు
డేవిడ్ వార్నర్ ఈ వరల్డ్ కప్ లోనే ఈ రికార్డు అందుకున్నాడు. టీమిండియాతో జరిగిన తొలి మ్యాచ్ లో వార్నర్ ఈ రికార్డు సాధించాడు. వార్నర్ కూడా 19 ఇన్నింగ్స్ ల్లోనే ఈ ఘనతను అందుకున్నాడు.