టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ శర్మ

టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ శర్మ

టీమ్‌ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ కీలక నిర్ణయం తీసుకున్నారు. అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. వన్డే, టెస్టుల్లో కొనసాగుతానని పేర్కొన్నారు. కాగా ఇప్పటికే కోహ్లీ సైతం టీ20లకు గుడ్ బై చెప్తున్నట్లు వెల్లడించారు. తర్వాతి తరానికి అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో వెనక్కి తగ్గుతున్నట్లు తెలిపారు.

 వరల్ట్ కప్ గెలవకపోయినా రిటైర్మెంట్ ప్రకటించే వాడినని చెప్పాడు రోహిత్.   159 టీ20మ్యాచ్‌లలో రోహిత్  4 వేల 231 పరుగులు చేశాడు.   ఐదు సెంచరీల అత్యధిక రికార్డును కూడా రోహిత్ కలిగి ఉన్నాడు.32 హాఫ్ సెంచ‌రీలు ఉన్నాయి. 2007లో టీమిండియా వరల్డ్ కప్ గెలిచినప్పుడు టీమ్ లో రోహిత్ సభ్యుడిగా ఉన్నాడు.  ఇప్పుడు కెప్టెన్ గా కప్ గెలిపించి టీ20కి వీడ్కోలు పలికాడు.  కాగా రోహిత్ కంటే ముందు భార‌త స్టార్ క్రికెట‌ర్ విరాట్ కోహ్లి సైతం అంత‌ర్జాతీ టీ20ల‌కు గుడ్‌బై చెప్పేశాడు.

టీ20ల్లో రోహిత్ శర్మ రికార్డు సృష్టించారు. కెప్టెన్‌గా 50 మ్యాచుల్లో జట్టుని గెలిపించిన అరుదైన ఫీట్ సాధించారు. ఆ తర్వాత బాబర్ ఆజమ్(48 మ్యాచ్‌లు, పాక్), బ్రెయిన్ మసాబా(45, ఉగాండా), మోర్గాన్( 44, ఇంగ్లండ్) ఉన్నారు. మరోవైపు రెండు టీ20 WC విజయాల్లో భాగమైన తొలి భారత క్రికెటర్‌గా రోహిత్ నిలిచారు. 2007 ఆరంభ టీ20 వరల్డ్ కప్ భారత జట్టులో రోహిత్ ఒకరు. ఆ టోర్నీలోనూ భారత్ విశ్వవిజేతగా నిలిచింది.