Cricket World Cup 2023: డివిలియర్స్‌ను వెనక్కి నెట్టేశాడు: రోహిత్ శర్మ ఖాతాలో ఆల్‌టైం రికార్డ్

Cricket World Cup 2023: డివిలియర్స్‌ను వెనక్కి నెట్టేశాడు: రోహిత్ శర్మ ఖాతాలో ఆల్‌టైం రికార్డ్

వరల్డ్ కప్ లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ హవా కొనసాగుతుంది. ఈ మెగా టోర్నీలో నిలకడగా ఆడటంతో పాటు వేగంగా పరుగులు చేస్తూ దూసుకెళ్తున్నాడు. ప్రస్తుతం బెంగళూరులోని చిన్నస్వామి వేదికగా భారత్, నెదర్లాండ్స్ జట్ల మధ్య వరల్డ్ కప్ చివరి లీగ్ మ్యాచ్ ఆడుతుంది. ఈ మ్యాచ్ లో  టాస్ గెలిచి భారత్ బ్యాటింగ్ తీసుకోగా.. రోహిత్ మరో  హాఫ్ సెంచరీ తన ఖాతాలో వేసుకున్నాడు. ఆరంభం నుంచి వేగంగా ఆడిన హిట్ మ్యాన్ 54 బంతుల్లో 61 పరుగులు చేసి ఔటయ్యాడు. రోహిత్ ఇన్నింగ్స్ లో 8 ఫోర్లతో పాటు రెండు సిక్సులున్నాయి.

ఈ క్రమంలో వన్డే చరిత్రలో ఒక ఆల్ టైం రికార్డ్ ను ఈ ముంబై వీరుడు తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఏడాది వన్డేల్లో 59 సిక్సర్లు బాదిన రోహిత్.. ఒక ఏడాదిలో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్‌గా సరికొత్త చరిత్ర సృష్టించాడు. 2015లో సౌతాఫ్రికా మాజీ విధ్వంసకర బ్యాటర్  ఏబీ డివిల్లియర్స్ 58 సిక్సర్ల రికార్డు ఇప్పటివరకు అత్యధికం.  తాజాగా రోహిత్  ఈ రికార్డ్ బ్రేక్ చేశాడు. ఇక ఈ రికార్డ్ తో పాటు వరల్డ్ కప్ లో అత్యధిక సిక్సులు కూడిన ఆటగాడిగా మోర్గాన్ రికార్డ్ బ్రేక్ చేసాడు. మోర్గాన్ 2019 లో 22 కొడితే.. 23 సిక్సులతో ఈ రికార్డ్ రోహిత్ సొంతం చేసుకున్నాడు. 

రోహిత్(61) తో పాటు గిల్(51),  కోహ్లీ(51) హాఫ్ సెంచరీలు చేయడంతో భారత్ భారీ స్కోర్ దిశగా  దూసుకెళ్తుంది. ప్రస్తుతం టీమిండియా 33 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది. శ్రేయాస్ అయ్యర్ (44), రాహుల్ (9) క్రీజ్ లో ఉన్నారు. నెదర్లాండ్స్ బౌలర్లలో వాన్ మీకరన్, వాన్ డెర్ మెర్వ్, బేస్ డీ లీడ్ తలో వికెట్ తీసుకున్నారు.        

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ICC (@icc)