వన్డే వరల్డ్ కప్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కిర్రాక్ రికార్డు సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సిక్సులు బాదిన బ్యాటర్ గా చరిత్రకెక్కాడు. ఇప్పటి వరకు ఈ రికార్డు విండీస్ దిగ్గజం క్రిస్ గేల్ పేరిట ఉండేది. కానీ అప్ఘాన్ తో జరుగుతున్న మ్యాచ్ లో రోహిత్ శర్మ మూడు సిక్సులు బాదడంతో..ఈ అరుదైన రికార్డును ఖాతాలో వేసుకున్నాడు.
ALSO READ : ICC World Cup 2023: రోహిత్ శర్మ నువ్ కేక.. వరల్డ్ కప్ చరిత్రలోనే అత్యంత ఫాస్టెస్ట్ రికార్డు
క్రిస్ గేల్ 551 అంతర్జాతీయ మ్యాచుల్లో 553 సిక్సులు కొట్టగా..రోహిత్ శర్మ 472 మ్యాచుల్లో 554 సిక్సులు బాది నెంబర్ వన్ ప్లేస్ ను దక్కించుకున్నాడు. వీరిద్దరి తర్వాత షాహిద్ అఫ్రిదీ 476 సిక్సర్లతో మూడో స్థానంలో ఉండగా..బ్రెండన్ మెకల్లమ్ 389 సిక్సర్లతో నాల్గో స్థానంలో, మార్టిన్ గప్టిల్ 383 సిక్సర్లతో టాప్ 5 లో కొనసాగుతున్నారు.
భారత్ నుంచి రోహిత్ శర్మ తర్వాత మహేంద్ర సింగ్ ధోని రెండో స్థానంలో ఉన్నాడు. ధోని 359 సిక్సర్లు బాదాడు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ 282 సిక్సర్లతో మూడో ప్లేస్ లో కొనసాగుతున్నాడు.