IND vs AFG: కోహ్లీ వస్తే వేటు ఖాయం..ఇద్దరు యంగ్ ప్లేయర్లకు కీలకంగా మారిన తొలి టీ20

IND vs AFG: కోహ్లీ వస్తే వేటు ఖాయం..ఇద్దరు యంగ్ ప్లేయర్లకు కీలకంగా మారిన తొలి టీ20

భారత్, ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య నేడు జరగబోతున్న తొలి టీ20 కు టాపార్డర్ ఖరారైంది. కెప్టెన్ రోహిత్ శర్మతో జైస్వాల్ ఓపెనింగ్ చేస్తాడని ఇప్పటికే కోచ్ ద్రవిడ్ చెప్పుకొచ్చాడు. కోహ్లీ వ్యక్తిగత కారణాల వలన తొలి టీ20 మ్యాచ్ కు అందుబాటులో లేకపోవడంతో గిల్ మూడో స్థానంలో బ్యాటింగ్ చేయడం దాదాపుగా ఖాయమైంది. సూర్య కుమార్, శ్రేయాస్ అయ్యర్  లేకపోవడంతో గిల్ నెంబర్ 3 లో బ్యాటింగ్ చేయనున్నాడు. 

గిల్, జైస్వాల్ ఫామ్ లోనే ఉండటంతో  భారత బ్యాటింగ్ ఆర్డర్ లో ఎలాంటి సమస్యలు లేవు. ఇంతవరకు బాగానే ఉన్నా తొలి టీ20 తర్వాత ఈ ఇద్దరు యంగ్ ప్లేయర్లలో ఒకరు బెంచ్ మీద కూర్చోవడం ఖాయంగా కనిపిస్తుంది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రెండో టీ20కు జట్టులో చేరనుండడంతో గిల్, జైస్వాల్ కు ఈ మ్యాచ్ అగ్ని పరీక్షగా మారనుంది. కోహ్లీ వస్తే మూడో స్థానంలో బ్యాటింగ్ చేస్తాడు. దీంతో   నేడు జరగనున్న మ్యాచ్ లో ఎవరు మెరుగైన ప్రదర్శన చేస్తారో వారు రెండో టీ20లో రోహిత్ తో కలిసి ఓపెనర్ గా బరిలోకి దిగుతారు. 

టాలెంట్ ఉన్నా ఇద్దరు కూడా మిడిల్ ఆర్డర్ లో ఆడలేకపోవడం ప్రతికూలంగా మారింది. గిల్, జైస్వాల్ గత ఏడాది కాలంగా టీ20 ఫార్మాట్ లో అద్భుతమైన ఫామ్ లో ఉన్నారు. రోహిత్ గైర్హాజరీలో టీమిండియాకు వీరిద్దరే ఓపెనింగ్ చేశారు. ఐపీఎల్ లో ఇద్దరు 600 కు పైగా పరుగులు చేశారు. జైస్వాల్ ఆరంభం నుంచి దూకుడుగా ఆడితే.. బాధ్యాతాయుత ఇన్నింగ్స్ ఆడటం గిల్ స్పెషాలిటీ. టీ20 వరల్డ్ కప్ లో రోహిత్, కోహ్లీ టాపార్డర్ లో ఖచ్చితంగా ఉంటారు. దీంతో టాపర్దర్ లో ఒక్క స్థానం మాత్రమే మిగిలి ఉంటుంది. ఈ స్థానం ఎవరికీ దక్కుతుందో ఆసక్తికరంగా మారింది.