IND vs ENG: ఊకో ఊకో బాధపడకు.. కోహ్లీని ఓదార్చిన రోహిత్

IND vs ENG: ఊకో ఊకో బాధపడకు.. కోహ్లీని ఓదార్చిన రోహిత్

ఇంగ్లండ్‌తో జరిగిన మూడో వన్డేలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ(55) ఆకట్టుకున్నాడు. గత కొంతకాలంగా ఫామ్ లేక పరుగులు చేయడానికి నానా తంటాలు పడుతోన్న కోహ్లీ ఈ మ్యాచ్‏లో తిరిగి గాడినపడినట్లే కనిపించాడు. తన శైలికి భిన్నంగా క్రీజ్‎లోకి వచ్చి రావడంతోనే దూకుడు ప్రదర్శించిన రన్ మెషిన్.. 50 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

Also Read :- 2008 నుండి 2025 వరకు RCB కెప్టెన్లు వీరే

క్రీజులో కోహ్లీ ఎలాంటి ఒత్తిడి లేకుండా యథేచ్చగా ఆడుతుండటం చూసి కోహ్లీ సెంచరీ చేయడం పక్కా అని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. కానీ ఫ్యాన్స్ ఆశలు నిమిషాల్లోనే అడియాశలు అయ్యాయి. హాఫ్ సెంచరీ చేసిన కాసేపటికే అతడు ఔట్ అయ్యాడు. ఇంగ్లండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ ఓ చక్కని బంతితో కోహ్లీని పెవిలియన్ చేర్చాడు. బంతిని డిఫెన్స్ ఆడబోగా.. ఔట్ సైడ్ ఎడ్జ్ తీసుకుని నేరుగా కీపర్ ఫిల్ సాల్ట్ చేతుల్లో పడింది. దాంతో, కోహ్లీ తీవ్ర నిరాశతో క్రీజు‎ను వీడాడు.

రోహిత్ ఓదార్పు..

ఔటైన అనంతరం డగౌట్ చేరుకున్న కోహ్లీని రోహిత్ శర్మ ఓదార్చాడు. 'ఆ బంతిని అలా ఆడాల్సింది కాదు..' అన్నట్లుగా కోహ్లీ బాధపడుతుండగా.. హిట్‌మ్యాన్ ఊకో ఊకో బాధపడకు అని అతనికి సర్ది చెప్పాడు. 55 పరుగులు మంచి నాక్ ఆడావ్ అంటూ అతన్ని మెచ్చుకున్నాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.