టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ సిరీస్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ లోకి బరిలోకి దిగుతున్నాడు. గత కొంతకాలంగా పేలవ ఫామ్ లో ఉన్న హిట్ మ్యాన్ ఫామ్ లోకి రావాలని టీమిండియా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ ముందు రోహిత్ ఫామ్ లోకి రావడం టీమిండియాకు చాలా కీలకం. నాగ్ పూర్ వేదికగా నేడు (ఫిబ్రవరి 6) జరగబోయే తొలి వన్డేకు ముందు రోహిత్ ప్రెస్ కాన్ఫరెన్స్ తో మాట్లాడాడు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా రోహిత్ తన సహనాన్ని కోల్పోయినట్టు తెలుస్తుంది.
మ్యాచ్ కు ముందు జరిగిన విలేకరుల సమావేశంలో రోహిత్ తన పేలవ ఫామ్ గురించి అడిగినప్పుడు చిరాకుపడ్డాడు. క్రికెటర్ కెరీర్ లో ఆటుపోట్లు సహజమని.. ప్రతి ఫార్మాట్, సిరీస్ కొత్త సవాలు అని చెప్పాడు. తన భవిష్యత్తు గురించి వస్తున్న ఊహాగానాలను రోహిత్ పక్కన పెట్టి, ఇంగ్లాండ్‌తో జరిగే వన్డేలు, ఛాంపియన్స్ ట్రోఫీపై మాత్రమే తన దృష్టి ఉందని అన్నాడు. మీరు అడిగిన వాటికి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదని హిట్ మ్యాన్ అన్నాడు. ఇంగ్లాండ్ తో సిరీస్.. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత ఏమి జరుగుతుందో నేను ఇప్పుడే చెప్పలేను అని రోహిత్ శర్మ అన్నాడు.
Also Read :- ఫామ్‌లో ఉన్నా ఆ ఇద్దరికీ నో ఛాన్స్
ఛాంపియన్స్ ట్రోఫీ రోహిత్ ముందు ఉన్న అతి పెద్ద సవాలు. 2013 లో ఇంగ్లాండ్ వేదికగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీని ధోనీ కెప్టెన్సీలో భారత్ గెలుచుకుంది. అప్పుడు ప్లేయర్ గా రోహిత్ శర్మ భారత్ టైటిల్ గెలవడంతో కీలక పాత్ర పోషించాడు. ఈసారి బ్యాటర్ గా.. కెప్టెన్ గా సత్తా చాటడానికి సిద్ధంగా ఉన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత క్రికెట్ నియంత్రణా మండలి (BCCI) రోహిత్ శర్మ సారథ్యంలో 15 మంది సభ్యులతో కూడిన బలమైన జట్టును ఎంపిక చేసింది. 2024 లో భారత్ కు టీ20 వరల్డ్ కప్ అందించిన రోహిత్ శర్మ.. ఛాంపియన్స్ ట్రోఫీ కూడా అందిస్తే అరుదైన జాబితాలో చేరతాడు.
A new challenge, a new chapter. Rohit Sharma is leading the charge! 🇮🇳vs🏴#TeamIndia #INDvsENG pic.twitter.com/nWP2zPnFJU
— Doordarshan Sports (@ddsportschannel) February 6, 2025