MI vs SRH: వరుసగా 5 మ్యాచ్‌ల్లో విఫలం.. వరల్డ్ కప్ ముందు కలవరపెడుతున్న రోహిత్ ఫామ్

MI vs SRH: వరుసగా 5 మ్యాచ్‌ల్లో విఫలం.. వరల్డ్ కప్ ముందు కలవరపెడుతున్న రోహిత్ ఫామ్

టీమిండియా కెప్టెన్, ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో పేలవ ప్రదర్శన కొనసాగిస్తున్నాడు. టోర్నీ ప్రారంభంలో బాగా ఆడినా.. ఆ తర్వాత తేలిపోయాడు. ముఖ్యంగా చివరి 5 ఇన్నింగ్స్ లో హిట్ మ్యాన్ ఘోరంగా విఫలమయ్యాడు. కేవలం 6 యావరేజ్ తో 33 పరుగులు మాత్రమే చేశాడు. మరో నెల రోజులల్లో వరల్డ్ కప్ ఉండడంతో రోహిత్ పేలవ ఫామ్ టీమిండియా క్రికెట్ ఫ్యాన్స్ ను కలవరానికి గురి చేస్తుంది. రోహిత్ సైతం తన ఫామ్ గురించి ఆందోళన పడుతున్నట్టు కనిపించాడు. 

ఐపీఎల్ లో భాగంగా నిన్న (మే 6) సన్ రైజర్స్ హైదరాబాద్ తో ముంబై ఇండియన్స్ మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. 174 పరుగుల లక్ష్య ఛేదనంలో రోహిత్ శర్మ జట్టుకు మంచి ఆరంభాన్ని ఇవ్వలేకపోయాడు. తన చెత్త ఫామ్ ను కొనసాగిస్తూ 4 పరుగులే చేసి  పెవిలియన్ బాట పట్టాడు. కమిన్స్ వేసిన లెంగ్త్ బాల్ ను ఆడే ఫ్లిక్ ఆడే క్రమంలో వికెట్ కీపర్ క్లాసన్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. చివరి ఐదు ఇన్నింగ్స్ ల్లో రోహిత్ కు ఇది నాలుగో సింగిల్ డిజిట్ కావడం విశేషం.

రోహిత్ ఔట్ కావడంతో ముంబై ఇండియన్స్ కష్టాల్లో పడింది. దీంతో డ్రెస్సింగ్ రూమ్ కు వచ్చిన తర్వాత హిట్ మ్యాన్ చాలా నిరుత్సాహానికి గురయ్యాడు. రోహిత్ ఏడుస్తూ ఉన్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. మొదటి 7 ఇన్నింగ్స్ ల్లో 297 పరుగులు చేసి రాణించినా.. చివరి ఐదు ఇన్నింగ్స్ ల్లో తన ఫామ్ కోల్పోయాడు. టీమిండియాకు రోహిత్ ఎంత కీలక ప్లేయర్ అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వరల్డ్ కప్ ముందు హిట్ మ్యాన్ ఫామ్ లోకి రావడం చాలా కీలకం. టోర్నీలో మిగిలిన రెండు మ్యాచ్ లోనైనా రోహిత్ గాడిలో పడతాడో లేదో చూడాలి.