
ప్రస్తుతం దేశంలో ఐపీఎల్ సందడి నడుస్తున్నా.. అందరి దృష్టి మాత్రం టీ20 వరల్డ్ కప్ ఎంపికపైనే ఉంది. జూన్ 1న మెగా ఈవెంట్ తెరలేవనుంది. అందుకు మరెంతో సమయం లేదు. సరిగ్గా 50 రోజుల గడువు మాత్రమే మిగిలివుంది. పైగా మెగా టోర్నీలో పాల్గొనే ఆయా జట్లు.. తమ ఆటగాళ్ల వివరాలను అందించడానికి మే1 డెడ్‌లైన్. దీంతో టీమిండియా టీ20 వరల్డ్ కప్ జట్టుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. నేడు (ఏప్రిల్ 29) లేదా రేపటిలో జట్టును ప్రకటించాల్సి ఉంది. ఇదిలా ఉంటే ఈ పొట్టి సమరానికి కోహ్లీ ఉండడం దాదాపుగా ఖరారైంది.
ఇటీవలే కోహ్లీ స్ట్రైక్ రేట్ పై తీవ్ర విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. దీంతో కోహ్లీ టీ20 వరల్డ్ కప్ కు సెలక్ట్ అవుతాడో లేదో ఎక్కడో చిన్న అనుమానాలు ఉన్నాయి. తాజా సమాచార ప్రకారం టీ20 వరల్డ్ కప్ కు బ్యాటింగ్ మాస్ట్రో విరాట్ కోహ్లీని ఎంపిక చేయాలని భారత కెప్టెన్ రోహిత్ శర్మ జాతీయ సెలెక్టర్లను కోరినట్లు నివేదికలు చెబుతున్నాయి. టాపార్డర్ లో ఏకైక లెఫ్ట్ హ్యాండర్ గా జైస్వాల్ పేరు దాదాపుగా ఖరారైంది. సూర్య కుమార్ యాదవ్, జడేజా, కుల్దీప్ యాదవ్, బుమ్రా స్థానాలకు ఎలాంటి డోకా లేదు.
ఇటీవలే కాలంలో అత్యంత నిలకడగా నిలకడగా రాణిస్తున్న రింకూ సింగ్, శివమ్ దూబే మధ్య తీవ్ర పోటీ నెలకొంది. పేలవ ఫామ్ లో ఉన్న హార్దిక్ పాండ్య ఎంపిక కష్టంగా మారింది. వికెట్ కీపర్ రేస్ లో సంజు శాంసన్ ప్రధాన వికెట్ కీపర్ గా ఉండనున్నట్లు రిపోర్ట్స్ చెబుతున్నాయి. జూన్ 1 నుంచి జరగనున్న ఈ మెగా టోర్నీ జూన్ 29న ముగుస్తుంది. వెస్టింసీడ్, అమెరికా సంయుక్తంగా ఈ మెగా టోర్నీకి ఆతిధ్యమిస్తున్నాయి.
Rohit Sharma demands Virat Kohli in the Indian team from the selectors- Reportshttps://t.co/50AmZC4ykR
— Cricket Addictor (@AddictorCricket) April 29, 2024